దావోస్ నేటి నుంచి ఈ నెల 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యాఈఎఫ్ సదస్సు జరుగునుంది. అయితే సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం దావోస్‌కు సీఎం జగన్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు వెళ్లిన జగన్‌కు.. జ్యూరిక్ ఎయిర్‌పోర్టులో స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తెలుగు ప్రజలు, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం…
గత ఎన్నికల్లో టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు ఇటీవల సీఎం జగన్ రాజ్యసభ సీటు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే బీద మస్తాన్‌రావు రాజ్యసభ సీటును డబ్బులిచ్చి కొనుక్కున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీద మస్తాన్‌రావు స్పందించారు. డబ్బులిస్తే రాజ్యసభ సీటు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. డబ్బులకే రాజ్యసభ సీట్లు దక్కుతాయనుకుంటే రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లు కూడా ఇచ్చేందుకు చాలా మందే ఉన్నారని బీద మస్తాన్‌రావు…
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన గజ మాలతో ఘన స్వాగతం పలికారు. అయితే.. ఇటీవల ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి, ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో…
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… అందుకోసం ప్రత్యామ్నాయ ఎజెండాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తాజాగా జాతీయ స్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. అయితే.. సీఎం కేసీఆర్.. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ నెల 30 వరకు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీల నేతలను కలిసి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ధాన్యం కొనుగోలుపై కొంత కాలంగా కేంద్రంపై…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. భారత దేశంలో అత్యంత అవినీతి సీఎం జగన్ అని.. ఏపీలో కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే పథకం ప్రకారం జగన్ అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. కల్పవృక్షం లాంటి అమరావతిని నీరుగార్చారని.. ఒక సామాజిక వర్గానికి అమరావతిని అంటగట్టడం దారుణమైన విషయమని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం అమరావతే రాజధాని…
ఏపీలో పొత్తుల రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ పొత్తుల మీదే కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. ప్రజాసమస్యలు వదిలేసి మూడు ప్రధాన పార్టీలు పొత్తుల గురించి ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందని.. ఇప్పటి నుంచే పొత్తుల గురించి చర్చలు ఎందుకుని హర్షకుమార్ ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ గుప్పెట్లో ఉన్నాయని ఆరోపించారు. మరోవైపు జనసేన అధినేత పవన్…
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఆదివారం చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నడ్డా…కాంగ్రెస్ రాహుల్ గాంధీ మిడతల దండులా తెలంగాణ మీద పడ్డరంటూ విమర్శలు చేశారు. పచ్చబడుతున్న తెలంగాణను ఆగం చేయాలనుకుంటున్నారా.. అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడి సంక్షేమ పథకాలు ఎందుకు లేవు..? అని ఆయన ప్రశ్నించారు. కరెంట్ ఇస్తలేరని బీహార్‌లో రైతులు ట్రాన్స్ఫార్మర్ తగులబెట్టారు అని, దేశ చరిత్రలోనే…
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యెం మండలంలో ఆదివారం నాడు ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొత్తు లేకుండా ఎన్నికలు వెళ్లిన దాఖలాలే లేవని ఆరోపించారు. గతంలో తెలంగాణలో కేసీఆర్‌తో కూడా పొత్తు పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు. కేవలం 2019 ఎన్నికల్లో మాత్రమే చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు…
విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో వైఎస్ఆర్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మంత్రి విడదల రజనీ, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహా వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2014 నుంచి…
ఏపీ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో జగన్ పాకుడు మెట్ల మీద ఉన్నారని.. ప్రతిరోజూ ఆయన కొద్ది కొద్దిగా దిగజారిపోతున్నారని ఎద్దేవా చేశారు. జై జగన్ కాదు.. గో బ్యాక్ జగన్ అని ప్రజలే నినాదాలిస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల ఆరోపించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు టూర్ మూడు రోజుల పాటు అద్భుతంగా జరిగిందని.. ఏపీ ప్రభుత్వం ఛార్జీలతో విపరీతంగా బాదేస్తుందని ప్రజలే చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఓ చేత్తో డబ్బులు…