తెలంగాణలో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన వ్యవహారంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇస్తూ ఆయన తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని…
KTR : తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభివృద్ధి చేయడం చేతకాదని, కేవలం వ్యవస్థలను కూల్చడం మాత్రమే తెలుసని ఆయన మండిపడ్డారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, ప్రభుత్వం నడపడం ఈ “సన్నాసుల” వల్ల కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి బూతుల భాష తప్ప మరే భాష రాదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో…
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తన ప్రభుత్వం అనుసరిస్తున్న స్పష్టమైన విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి చాటిచెప్పారు. పొరుగు రాష్ట్రాలతో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా జల వివాదాల విషయంలో రాజకీయ లబ్ధి కంటే రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తారు. “తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని ఎవరైనా నన్ను అడిగితే..…
Shashi Tharoor: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి శశి థరూర్ మరోసారి గైర్హాజరయ్యారు. ఆయన ఇలా చేయడం వరసగా ఇది మూడోసారి. పార్టీ కార్యకలాపాలు, సమావేశాలకు థరూర్ పదే పదే హాజరవ్వకపోవడం కాంగ్రెస్‌లో అసంతృప్తిని పెంచుతోంది.
Off The Record : పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతను ఆ మంత్రిగారు బాగా… ఒంటబట్టించుకున్నారా. అందుకే ఏళ్ళ తరబడి టీడీపీని నమ్ముకుని ఉన్న వాళ్ళని కాదని… పదవుల పందేరంలో జంపింగ్ జపాంగ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారా? చివరికి సొంత నియోజకవర్గంలో సొంత కేడరే ఆమె కార్యక్రమాన్ని బహిష్కరిస్తోందా? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్‌లో అంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ఆ మినిస్టర్ ఎవరు? ఎందుకలా జరుగుతోంది? ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి సొంత…
Anam Ramnarayana Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్‌పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు రైతులపై అకస్మాత్తుగా ప్రత్యేకమైన ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు.. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రైతుని కూడా పరామర్శించలేదన్న ఆయన.. మొంథా తుఫాను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమించారని, తుఫాను సమయంలో ప్రభుత్వం చక్కగా పని చేసిందని ప్రజలంతా ప్రశంసిస్తున్నారని తెలిపారు. అయితే ఉనికి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. “తుఫాన్ కారణంగా పంటలు బాగా నష్టపోయాయి. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాన్ తాకి దిగుబడులు తగ్గిపోయాయి. నేలకొరిగిన పంట తిరిగి నిలబడే అవకాశం లేదు. దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపగా, 15 లక్షల…
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ( అక్టోబర్ 25న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్ర నేతలతో ఆయన కీలక సమావేశం జరిపే అవకాశం ఉంది.
Mayawati: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి గురువారం ప్రశంసలు కురిపించారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), తన ప్రభుత్వ హమాంలో నిర్మించిన సంస్థలు, దళిత స్మారక చిహ్నాల నిర్వహణ విషయంలో అఖిలేష్ యాదవ్ రెండు ముఖాలతో వ్యహరించారని విమర్శించారు.