జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన గజ మాలతో ఘన స్వాగతం పలికారు. అయితే.. ఇటీవల ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి, ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణలో జనసేన పార్టీ పటిష్ఠత కోసం కృషి చేస్తామన్న పవన్.. చౌటుప్పల్ లో పర్యటన ముగించుకున్న పవన్ కల్యాణ్ కోదాడకు బయలు దేరారు. కోదాడలో గత ఏడాది ఆగస్టు 20న బక్కమంతులగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కడియం శ్రీనివాస్ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. కాగా, నల్గొండ బయలుదేరే ముందు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద, సికింద్రాబాద్, మెట్టుగూడ, ఎల్బీ నగర్ వద్ద ఆగుతూ అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడారు.