ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన జగన్ రాజధాని చేరుకున్న వెంటనే సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే.. ఈ భేటీలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర…
అమరావతిలో నేడు టీడీపీ చీఫ్ చంద్రబాబు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికపై వైసీపీ కనీస సంస్కారం లేకుండా మాట్లాడిందని ఆయన మండిపడ్డారు. చనిపోయిన కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదనేది టీడీపీ విధానమని, ఈ విధానంతోనే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ నేత చనిపోవడం వల్ల వచ్చిన…
ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో 2 రోజుల పాటు నిర్వహించాల్సిన “నవ సంకల్ప్ కార్యశాల”లో పాల్గొనడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే.. ఉన్నట్టుండి.. ఉత్తరప్రదేశ్ పర్యటనను ముగించుకొని ఢిల్లీకి తిరిగివెళ్లారు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలతో పాటు పార్టీని రాష్ట్రంలో బలపర్చే అంశాలపై కీలక చర్చల్లో ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. అయితే.. ఆమె ఒక్కసారిగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్న విషయం ఆ పార్టీ యూపీ నేతలకు కూడా తెలియకపోవడంతో…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు పథకాలు ఏమీ ఇవ్వనని చంద్రబాబు పరోక్షంగా చెప్తున్నారని బొత్స ఆరోపించారు. సంక్షేమ పథకాల రూపంలో డీబీటీ ద్వారా చేసిన ప్రయోజనం పేద ప్రజల కోసం కాదని.. రాజకీయ ప్రయోజనాల కోసం అన్నది చంద్రబాబు ఉద్దేశమన్నారు. ఇది దుర్మార్గపు ఆలోచనగా బొత్స విమర్శలు చేశారు. ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబుకు పేరుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా క్రీములు, పౌడర్ల…
నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు శతిజయంతి వేడుకులను పురస్కరించుకొని టీడీపీ అధినేత ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనం మన వెంట ఉంటే జనం లేని బస్సులు వైసీపీ వైపు ఉన్నాయంటూ ఆయన విమర్శించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు జాతి వెలుగు ఎన్టీఆర్. తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్. ఎంతమంది పుట్టినా ఎన్టీఆర్ ఎన్టీఆరే అంటూ ఆయన కొనియాడారు.…
ప్రధాని మోడీ నేడు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. అయితే ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే బేగంపేట ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. టీఆర్ఎస్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మోడీ మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని.. అలాంటి త్యాగాలతో వచ్చిన తెలంగాణ ఏ ఒక్క కుటుంబం కోసమో కాదన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ…
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ఎఫ్ఆర్బీఎం రూపంలో యత్నిస్తోందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని శాసనమండి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని విభజన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలన్నారు. రాష్ట్రాలను ఆస్థిర పరిచేందుకు, బలహీన పరిచేందుకు, సంక్షేమ పథకాలు నిలిచిపోయేలా…
ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి మేరుగ నాగార్జునపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి మేరుగ నాగార్జున పేరు చివర రెడ్డి అనే పదం కనిపించడంపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి మేరుగ నాగార్జున తాను దళిత బిడ్డ అన్న విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారని వంగలపూడి అనిత సెటైర్ వేశారు. దళితుల మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ…
23, 24, 25 తేదీల్లో జేసీ నాగిరెడ్డి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి టీమ్ లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వ పాలనలో కనీసం గుడికి వెళ్లేందుకు కూడా పర్మిషన్ తీసుకోవాలంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జేపీ ప్రభాకర్ రెడ్డి. రాయదుర్గంలో…