గత ఎన్నికల్లో టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు ఇటీవల సీఎం జగన్ రాజ్యసభ సీటు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే బీద మస్తాన్‌రావు రాజ్యసభ సీటును డబ్బులిచ్చి కొనుక్కున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీద మస్తాన్‌రావు స్పందించారు. డబ్బులిస్తే రాజ్యసభ సీటు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. డబ్బులకే రాజ్యసభ సీట్లు దక్కుతాయనుకుంటే రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లు కూడా ఇచ్చేందుకు చాలా మందే ఉన్నారని బీద మస్తాన్‌రావు వ్యాఖ్యానించారు.
Vallabhaneni Vamsi: వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నేనే..!!
రాజ్యసభ సీట్లను ఒక్కో దానిని రూ.100 కోట్లకు అమ్ముకుందంటూ వైసీపీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీద మస్తాన్‌రావు ఆరోపించారు. అధికారంలో ఉన్న వైసీపీకి డబ్బుతో పనేంటి అంటూ ఆయన ప్రశ్నించారు. గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు కూడా రాజ్యసభ సీట్లిచ్చారని.. వాళ్లు ఎంత డబ్బు ఇచ్చి ఉంటారో చెప్పగలరా అంటూ మీడియాను నిలదీశారు. తనతో పాటు రాజ్యసభ సీటు దక్కిన ఆర్.కృష్ణయ్య ఆర్థిక పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందేనని బీద మస్తాన్‌రావు గుర్తుచేశారు.