ఏపీలో పొత్తులపై వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ.. గతంలో మన మిత్రపక్షంగా ఉన్న టీడీపీ సరిగా పట్టించుకోలేదని, బీజేపీ కార్యకర్తలు ఇచ్చిన రిప్రజెంటేషన్లను మన మిత్రపక్షంగా ఉన్న వాళ్లు చించేసేవారని ఆమె అన్నారు. పరిస్థితి ఈ విధంగా ఉందని నాడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్తే.. మీ బలమెంత..? అని అమిత్ షా ప్రశ్నించారని ఆమె అన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం…
నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తులు ప్రారంభించారు. అయితే.. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ శక్తికేంద్రాలుగా మార్చింది. వాటికి ఇంఛార్జీలను నియమించింది. ఆయా శక్తి కేంద్రాల ఇంఛార్జీలతో విజయవాడలో…
మరోసారి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఆయన నేడు నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ బీజేపీ పోరాటం చేస్తోందని, సిద్ధాంతమని చెప్పుకొనే డీఎంకే పార్టీల కూడా కాంగ్రెస్తో పాటు కుటుంబ పార్టీ గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, అందుకే పోటీ చేస్తున్నామన్నారు. సామాజిక న్యాయం పేరుతో వైసీపీ దగా చేస్తోందని, సామాజిక న్యాయం అయితే ఆత్మకూరులో బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ఆయన…
నిన్న ఘర్ణణలో హత్యకు గురైన టీడీపీ బీసీ నాయకుడు జల్లయ్య కుటుంబ సభ్యులను ఫోన్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తోంది సామాజిక అన్యాయమని, ఒక పక్క సామాజిక న్యాయ భేరి అంటూ బస్సు యాత్రలు చేస్తూ మరోపక్క బీసీ నాయకుల్ని పక్కా ప్రణాళికతో హత్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బీసీలు తనవైపు లేరనే కక్షతోనే తన సామాజిక వర్గం నేతల్ని బీసీ నాయకుల్ని…
మాజీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం జైలులో తోటి ఖైదీపై దాడి చేశారని సమాచారం. ఏదో విషయంపై ఇద్దరికి మాటామాటా పెరగడంతో ఎమ్మెల్సీ కోపంతో అతనిపై చెయ్యి చేసుకున్నారని తెలుస్తోంది. అయితే.. నిబంధనల ప్రకారం జైలులో ఉన్న ఖైదీలపై చిన్న గీత పడినా అక్కడి ఆసుపత్రిలో కారణం…
నాడు మద్యపాన నిషేదమన్న జగన్.. ఇప్పుడు టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మిస్తున్నారంటూ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. మహిళలపై రోజూ దారుణాలు జరుగుతున్నా.. జగన్ మాత్రం నేను సీఎంను కాదు, నాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. వైసీపీ నేతలు, వాలంటీర్లే కాలకేయుల్లా.. మారి మహిళలపై అత్యాచారాలు, దాడులకు తెగబడుతున్నారి ఆమె మండిపడ్డారు. వైసీపీ 3 ఏళ్ల పాలనపై కేకులు కట్ చేస్తున్న వైసీపీ…
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన జగన్ రాజధాని చేరుకున్న వెంటనే సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే.. ఈ భేటీలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర…
అమరావతిలో నేడు టీడీపీ చీఫ్ చంద్రబాబు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికపై వైసీపీ కనీస సంస్కారం లేకుండా మాట్లాడిందని ఆయన మండిపడ్డారు. చనిపోయిన కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదనేది టీడీపీ విధానమని, ఈ విధానంతోనే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ నేత చనిపోవడం వల్ల వచ్చిన…
ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో 2 రోజుల పాటు నిర్వహించాల్సిన “నవ సంకల్ప్ కార్యశాల”లో పాల్గొనడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే.. ఉన్నట్టుండి.. ఉత్తరప్రదేశ్ పర్యటనను ముగించుకొని ఢిల్లీకి తిరిగివెళ్లారు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలతో పాటు పార్టీని రాష్ట్రంలో బలపర్చే అంశాలపై కీలక చర్చల్లో ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. అయితే.. ఆమె ఒక్కసారిగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్న విషయం ఆ పార్టీ యూపీ నేతలకు కూడా తెలియకపోవడంతో…