బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను నిన్న ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రి కేటీఆర్ బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర పైన మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని.. జుటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని వ్యాఖ్యలు చేశారు. ‘‘పచ్చ బడుతున్న పాలమూరుపై కచ్చ కట్టిన మీకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదు. కృష్ణా జిలాల్లో తెలంగాణ వాటా…
డా.బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా నేడు తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాలని.. భారత ప్రజలను, అంబేద్కర్‌ను సీఎం కేసీఆర్ అవమానించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కేసీఆర్‌కు సామాజిక స్పృహ లేదని, జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు పెంచొచ్చని ఆయన వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లు కేసీఆర్ తగ్గించారని మండిపడ్డారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని…
మంత్రి వర్గం కూర్పు ఈ రోజు సాయంత్రానికి ఒక కొలిక్కి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా మంత్రి వర్గ సభ్యుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చివరి నిమిషంలో సీఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత మంత్రుల రాజీనామాలు శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నాయి. నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించారు.…
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ తన మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ కూర్పు తుది దశకు చేరుకుంది. గవర్నర్‌కు కొత్త మంత్రుల జాబితాను నేడు పంపనున్నారు. ఆ తర్వాత వ్యక్తిగతంగానూ సీఎంవో అధికారులు ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నారు. 11వ తేదీ ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరిని కొనసాగించాలి.. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశం పైన సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేసి, సీఎం జగన్ అన్ని…
1.టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు. నిజానికి ఈరోజు ఆయన పుట్టినరోజు. ఇలా బాలయ్య పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరినీ కలచి వేస్తోంది. గత కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉంటున్న బాలయ్య ఈ రోజు తుదిశ్వాస విడిచారు. https://ntvtelugu.com/veteran-actor-balayya-passes-away-at-94/ 2.దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటు గ్రాంటు…
ఏపీ సీఎం జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టేందుకు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ విస్తరణతో పాటు ఏపీలో అభివృద్ధి పనులపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. మా పై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు మేం చేయలేక పోతే మీరు వచ్చి చేయవచ్చు కదా అని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ నేతలు కబుర్లు కాదు కేంద్రం నుండి డబ్బులు…
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో వర్గవిభేదాలు బయటపడ్డాయి.. మహబూబాబాద్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆధ్యక్షరాలు ఎంపీ మాలోత్ కవిత రైతు దీక్షలో మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్ లాక్కొని మాట్లాడారు. బిత్తరబోయిన కవిత కిందకూర్చోని పక్కన వున్న ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్ రావుకి చెప్పారు. అంతేకాకుండా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్యక్షతన అనగానే… పక్కనే ఉన్నా…
ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఈసారి జాతీయ పార్టీ జెండా ఎగురుతుందా? కానీ టీఆర్ఎస్ పార్టీని చిత్తు చేసే సత్తా ఎవరికి ఉంది? గులాబీ దళాన్ని మట్టికరిపించే దమ్ము తమకే ఉందని చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కాంపిటీషన్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల పంజాబ్‌లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ ఇప్పుడు తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం సంక్లిష్టంగా ఉంది. అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు…
గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ముద్ర గతంలో ఎన్నడూ లేనంత అల్ప స్థాయికి పడిపోయింది. దాంతో 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన రాజకీయ పార్టీ తన జాతీయ ప్రాముఖ్యతను కోల్పోతోందని అనిపిస్తోంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీల విస్తరణతో దశాబ్దాలుగా భారత రాజకీయాలపై గల తన ఆధిపత్య శక్తిని కోల్పోతోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ…