ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సభ్యత్వ సమన్వయ కర్తలతో రాహుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌కు ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేసిన రాహుల్.. కేసీఆర్ వద్ద ధనం, అధికార బలం, పోలీసులు ఉన్నారు, కానీ జన బలం లేదని విమర్శించారు. ప్రజల…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికల్లో చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పొత్తులతోనే చంద్రబాబు పోటీ చేస్తారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. అనైతిక పొత్తులతో పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఏపీలో ప్రజలంతా వైసీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు,…
* ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే. దేశవ్యాప్తంగా వేడుకల్లో పాల్గొననున్న కార్మికులు. * నేడు జి.కొత్తపల్లిలో గంజి ప్రసాద్ అంత్యక్రియలు. ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించడానికి గ్రామానికి రానున్న హోం మంత్రి వనిత, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని *పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి రోజా పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి రోజా. మార్టేరులో జరుగుతున్న బాస్కెట్ బాల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి రోజా *తిరుపతిలో నేడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో…
పొలిటికల్ ఆనాలసిస్ట్ ప్రశాంత్ కిషోర్ (పీకే)తో పొత్తు గురించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్‌తో కలిసే పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవలే పీకే తాను కాంగ్రెస్‌లో చేరడం లేదని ప్రకటించిన తరువాత.. మమతా బెనర్జీ ఈ ప్రకటన చేయడం విశేషం. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.…
నల్గొండ జిల్లాలో నేడు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ కేటీఆర్.. ప్లీనరీలో కేసీఆర్ మాటలు చూస్తుంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారెమో..? అని ఆయన వ్యాఖ్యానించారు. ప్లీనరీలో కేసీఆఆర్.. ఎన్టీఆర్‌ని స్మరించారన్నారు. కేసీఆర్ తెలంగాణలో పోత్తుల గురించి ఆలోచిస్తున్నారు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నీ ముచ్చింతలకి ఎస్పీజీ వాళ్ళు రావద్దు అని చెప్పారు అని ఎప్పుడో చెప్పిన.. మీరే వినలేదు.. కేటీఆర్ మీడియా ముందే…
కేంద్రమంత్రి నితన్ గడ్కరీ నేడు తెలంగాణలో పలు నేషనల్ హైవే పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం హైవేను 4లేన్ల రహదారిగా విస్తరించాలని ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద కలిసి వినతి పత్రం అందజేశారు. తన చేవెళ్ల పార్లమెంట్…
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వం విప్ బాల్క సుమన్‌పై నిప్పులు చెరిగారు. ఇటీవల బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. రాహుల్ గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా..తప్పు లేదు నీకు అంటూ బాల్క సుమన్‌పై విమర్శలు చేశారు. బాల్క సుమన్ మీడియా ముందుకు వచ్చేటప్పుడు… కేసీఆర్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి పంపితే మంచిదని, కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చి రాజకీయంగా మేము లాభం పొందినమా..? అని అన్నారు. లాభం పొందింది మీరు రిజర్వేష్లు రాలేదు.. రుణమాఫీ…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. పీసీసీ చీఫ్ అయ్యాక మొదటి సారిగా ఆయన ఖమ్మం వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సభ విజయవంతం కోసం కార్యకర్తలతో మాట్లాడనున్నారు. వరంగల్ లో వచ్చే నెలలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సభ జరుగనుంది. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నేడు మరోసారి భేటి అయ్యారు. నిన్న ఉదయం నుంచి పీకేతో సీఎం కేసీఆర్ సాయంత్రం వరకు చర్చలు జరిపారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో పీకే చేరబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ అదిష్టానంతో పీకే వరుసగా మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యల చేసిన…
దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంతగా ఇప్పుడు డీలా పడింది. దాని పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఇదిలాగే కొనసాగితే అది వామపక్షాల సరసన చేరటం ఖాయం. పార్టీని నడిపిస్తున్న గాంధీ ఫ్యామిలీకి ఇది తెలియంది కాదు. కానీ తెలిసినా ఏమీ చేయకపోవటం వారి ప్రత్యేకత. మొదటి నుంచీ దిద్దుబాటు చర్యలు తీసుకుని వుంటే పరస్థితి ఇంతలా దిగజారేది కాదేమో. అధికారం దానంతటదే తమ చెంతకు నడుచుకుంటూ వస్తుందనే భావనలో కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటి వరకు ఉంది. కనుక,…