US Shooting: అగ్రరాజ్యం అమెరికాలో గత వారాంతం పలు ప్రాంతాల్లో కాల్పుల కలకలం రేపుతుంది. మిషిగన్‌లోని డెట్రాయిట్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిపిన కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కొప్పుగుండపాలెం గ్రామానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాబోతున్నారు. మృతురాలి బంధువులను కలిసి పరామర్శించునున్నారు. విద్యార్థిని దారుణ హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Anakapalli: అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పు గొండు పాలెంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
కిడ్నీ రాకెట్ కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. కిడ్నీ ఆపరేషన్ కోసం వసూలు చేసిన హాస్పిటల్ కోఆర్డినేటర్ అనిల్‌కు హాస్పిటల్‌కు ఎటువంటి సంబంధం లేదని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హాస్పిటల్లో పనిచేసిన అంత మాత్రాన హాస్పిటల్ కి ఏంటి సంబంధం అని అంటున్నారు యాజమాన్యం. అనిల్ ఆర్థిక లావాదేవీలకు తమకు ఎటువంటి సంబంధం లేదని, అనిల్ పాత్ర పై తమకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు.
ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీబీ ఓఎస్డీ (OSD) రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఘటన జరిగిన రోజే పీసీబీ ఉద్యోగులు నాగరాజు, రూపేంద్ర మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఓఎస్డీ రామారావుపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. గతంలో నమోదు 106 సెక్షన్ ను మార్చి కొత్తగా అదనపు సెక్షన్లను కలిపి ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
ఈ దొంగ మామూలోడు కాదండోయ్.. గుజరాత్ పోలీసులు ఇటీవల అనేక రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడిన ఓ దొంగను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత నెలలో రోహిత్ కానుభాయ్ సోలంకి వాపిలో లక్ష రూపాయల చోరీ కేసులో పోలీసుల వలకు చిక్కాడు.
ఓ బర్రె తన యజమాని వివాదాన్ని పరిష్కరించింది. పంచాయితీ పెద్ద మనుషులు, స్థానిక పోలీసులు తేల్చలేకపోయిన పంచాయితీని బర్రె తేల్చింది. ఇది వింతగా అనిపించినప్పటికీ నిజంగానే జరిగింది. తప్పిపోయిన ఓ బర్రె తనదంటే తనదని ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగారు.