Gannavaram: కృష్ణా జిల్లాలోని గన్నవరం పరిధిలోని బాపులపాడు హైవేపై పైవేట్ ట్రావెల్స్ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణీకులు నానా అగచాట్లు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి హైవే పైనే బస్సు నిలిచిపోయింది. అయితే, బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా అర్థరాత్రి 2 గంటలకు ఎలిగన్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగిపోయింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి చిన్న పిల్లలతో నడి రోడ్డు పైనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. దీంతో కొందరు ప్రయాణికులు ఎలిగన్స్ ట్రావెల్స్ ట్రావెల్ బస్సు యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. మీ డబ్బులు మీకు ఇస్తాము వెళ్ళండి అని నిర్లక్ష్యపు సుమాధానం చెబుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Financial Management: ఆర్థిక నిర్వహణలో ఇబ్బంది పడుతున్నారా.. పక్కాప్లాన్ ఇలా చేసేయండి..
అయితే, అందులో ఓ మహిళ 11 గంటలకు ఉద్యోగం కోసం సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంది.. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని ఆమె ఆందోళన చెందుతుంది. దిక్కుతోచని స్థితిలో వీరవల్లి పోలీసులకు ప్రయాణికులు ఎలిగన్స్ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ఇక, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. డ్రైవర్, క్లినర్ లను అదుపులోకి తీసుకొని పీఎస్ కు తరలించారు. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.