Road Accident: దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 42 మందికి గాయాలు అయ్యాయి.
ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మార్గదర్శకాల ప్రకారం పంజాబ్‌ను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు జరుగుతున్న ప్రచారంలో స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ (SSOC) అమృత్సర్ అంతర్-రాష్ట్ర ఆయుధాల అక్రమ రవాణా మాడ్యూల్‌ను బహిర్గతం చేసింది. ఈ ఆపరేషన్‌లో విదేశీ మూలం ఉన్న ఉగ్రవాది లఖ్బీర్ అలియాస్ లాండాకు చెందిన ఇద్దరు సహచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఆరు అధునాతన .32 బోర్ పిస్టల్స్‌తో పాటు మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఆమె వ్యవహారం ఓ వైపు రచ్చ రచ్చ చేస్తుంటే.. ఇంకోవైపు ఆమె తల్లిదండ్రుల పాత్ర కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ పూజా.. డ్యూటీలో చేరకముందే.. గొంతెమ్మ కోర్కెలు కోరింది. అధికార దుర్వినియోగానికి పాల్పడింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు బహోదాపూర్ పోలీస్ స్టేషన్లో నిందితుడు విద్యార్థిపై పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Threatening Letter: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని మోడీనగర్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో ఉన్న మసీదుకు బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేపుతుంది.
యూపీలోని మీరట్‌కు చెందిన ఓ యువకుడు బరేలీ జిల్లాకు చెందిన ఓ మహిళను ప్రేమించాడు. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో పరిచయం కాస్త.. ఫోన్లు మాట్లాడటం వరకు వచ్చింది. ఆ తర్వాత.. యువకుడు మహిళను కలిసేందుకు ఇంటికి రావడం కూడా ప్రారంభించాడు. వీరిద్దరి మధ్య ఇంతటీ కథ నడుస్తుందని.. మహిళ భర్తకు తెలయదు. భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిపోగానే.. మహిళ యువకుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేది. ఒకరోజు మహిళను కలిసేందుకు…
బీహార్‌లోని బెగుసరాయ్‌లో మేనమామ తన సొంత మేనకోడలిపై హత్యచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జహాన్‌పూర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు డయల్-112కు సమాచారం అందింది.