9th Class Girl Murder: కర్నూలు జిల్లాలోని ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక మృతదేహం కోసం 4వ రోజు కూడా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక మస్థ్యకారుల సహాయంతో కలిసి వెతుకుతున్నారు. జులై 7వ తేదీ నుంచి బాలిక కనిపించకుండా పోయింది. ముగ్గురు మైనర్ బాలురను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. బాలికపై అత్యాచారం, హత్య చేసి ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో పడేసామని సదరు మైనర్ బాలురు చెప్పారు. దీంతో మొదట కాలువలో ఒక చోట పడేసామని చెప్పిన మైనర్ బాలురు.. ఆ తరువాత కాలువలో పంప్ హౌస్ సమీపంలో పడేసామని మరోసారి చెప్పారు.
Read Also: Couple Life : దంపతుల జీవితంలో లైంగిక జీవితాన్ని మెరుగుపరచడం కోసం వీటిని పాటించాల్సిందే..
అయితే, ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కాలువలో 9వ తేది సాయంత్రం నుంచి బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆధునిక కెమెరాలు నీటిలోకి పంపి గాలించిన సిబ్బంది.. అయినా చిన్నారి మృతదేహం జాడ దొరకలేదు. అయితే, మరోవైపు విద్యార్థి వాసంతి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఆందోళనకు దిగారు. అదృశ్యమైన వాసంతిని ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆమె ఆచూకీ కనుక్కోలేకపోయారని వాసంతి తల్లిదండ్రులు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు కేజీ రోడ్డుపై ధర్నా విరమించే లేదని ఆందోళన చేశారు.