జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రానున్నాయి. 1860లో ఏర్పడిన ఇండియన్ పీనల్ కోడ్ (IPC) స్థానంలో ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ (BNS) వస్తుంది.
విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హైస్కూల్ మధరసా ( జామియా హైదయతుల్ వనాథ్ )లో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న ( గురువారం ) రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు కావడంతో పాటు గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) అనే బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా నేటి ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు అయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టుకు హాజరు పరుస్తున్న సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి దాడి చేసిన అంశంపై ఐపీసీ సెక్షన్ 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
నవమాసాలు మోసి.. కని పెంచిన బిడ్డల్ని ఓ కసాయి తల్లి అర్ధాంతరంగా కడతేర్చింది. ముక్కుపచ్చలారని చిన్నారులకు నిండు నూరేళ్ల నిండిపోయేలా చేసింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యలో చోటుచేసుకుంది.
యూపీలోని ఘజియాబాద్‌లో ఓ మహిళ రోడ్డుపై నగ్నంగా తిరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన మోహన్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక మహిళ రోడ్డు మధ్యలో నగ్నంగా నడుచుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. అయితే.. ఆమె ఎవరు, అలా ఎందుకు తిరుగుతుందో అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వీడియో ఎప్పటిది అనేది కూడా ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ వీడియో పాతది కావొచ్చని…
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలోని హసన్ నగర్ లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వెలుగులోకి వచ్చింది.
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఓ వ్యక్తి వీడియో తీసి దంపతులను బ్లాక్మెయిల్ చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిజానికి.. ఆ వ్యక్తి చాలాసార్లు సివిల్ సర్వీస్ (PSC) పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకున్నాడు. కానీ అతను బార్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత అతను డబ్బు సంపాదించడానికి తప్పు మార్గాలను ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి ఓ జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను చిత్రీకరించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి రూ.10 లక్షలు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
MLA Rajasingh: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారిందన్నారు. ఈ నెలలోనే అత్యధికంగా మర్డర్లు జరిగాయి.. ఓల్డ్ సిటీలో తెల్లవారు జామున 2, 3, 4 గంటల వరకు దుకాణాలు, హోటళ్లు తెరిచే ఉంచుతున్నారు.. దుకాణాలను బంద్ చేసేందుకే పోలీసులు వారి విధులు వారు నిర్వర్తిస్తున్నారు.