సోషల్ మీడియాలో స్నేహం ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలియదు. కొందరికి మంచి చేస్తుంటే.. మరికొందరికి తీవ్ర నష్టాల పాలవుతున్నారు. అన్యాయంగా.. సంసారాలను చెడగొడుతుంది. చాలా మంది సోషల్ మీడియా వేదికగా కలుసుకున్న వారు ఉన్నారు. సోషల్ మీడియాలో పరిచయమై.. దేశాలు దాటొచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే.. తాజాగా సోషల్ మీడియాలో పరిచయమైన ఇద్దరు పిల్లల తల్లితో యువకుడు తన భర్తకు పట్టుబడ్డాడు.
Komatireddy Rajagopal Reddy: ఒక లక్ష్యం నెరవేరింది.. ఇంకో లక్ష్యం కేసీఆర్‌ను జైలుకు పంపడమే..
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని మీరట్‌కు చెందిన ఓ యువకుడు బరేలీ జిల్లాకు చెందిన ఓ మహిళను ప్రేమించాడు. ఆ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో పరిచయం కాస్త.. ఫోన్లు మాట్లాడటం వరకు వచ్చింది. ఆ తర్వాత.. యువకుడు మహిళను కలిసేందుకు ఇంటికి రావడం కూడా ప్రారంభించాడు. వీరిద్దరి మధ్య ఇంతటీ కథ నడుస్తుందని.. మహిళ భర్తకు తెలయదు. భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిపోగానే.. మహిళ యువకుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకునేది. ఒకరోజు మహిళను కలిసేందుకు ప్రేమికుడు తన ఇంటికి వచ్చాడు. వారిద్దరూ గదిలో సరదాగా గడుపుతుండగా.. ఇంతలో మహిళ భర్త వచ్చాడు. వెంటనే గదికి వెళ్లి చూడగా భార్య ప్రేమికుడితో రొమాన్స్ చేస్తుండటం చూశాడు. ఈ ఘటన గురించి భర్త పోలీసులకు చెప్పి ఇద్దరినీ అప్పగించాడు. పోలీసులు ఆ మహిళతో పాటు భర్తను, ప్రేమికుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Mudasarlova Park Issue: డిప్యూటీ సీఎం పవన్ దగ్గరకు ముడసర్లోవ పార్క్ పంచాయితీ..
పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై వారిని విచారించగా.. యువకుడు మహిళను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. మహిళను తన పిల్లలను తీసుకెళ్తానని పోలీసులకు చెప్పాడు. దీనికి భర్త ఒప్పుకోలేదు. భార్య సైతం యువకుడితోనే కలిసి ఉంటానని పోలీసులకు చెప్పింది. కాగా.. ఈ విషయంపై చాలా సేపు చర్చ జరిగింది. చివరకు మహిళను తన భర్త వద్ద ఉండాలని పోలీసులు సూచించారు. నీ కోసం కాకపోయినా.. నీ పిల్లల కోసమైనా నీ భర్తతో కలిసి ఉండాలని పోలీసులు చెప్పారు. చివరకు యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. కాగా.. ఈ విషయం చాలా చర్చనీయాంశంగా మారింది.