Threatening Letter: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని మోడీనగర్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో ఉన్న మసీదుకు బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేపుతుంది. మసీద్ యొక్క లౌడ్ స్పీకర్ తీయకుంటే అందులో ఉన్న మృతదేహాలను లెక్కిస్తానని లేఖలో ప్రస్తావించారు. ఈ విషయమై మురాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మసీదు నిర్వహకులు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు అందుకున్న తర్వాత మసీదు చుట్టూ పోలీసు బలగాలను మోహరించి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Puri Ratna Bhandar: 40ఏళ్ల తర్వాత ఆదివారం నాడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం
అయితే, సునేహ్రీ మసీదు మోడీనగర్‌లోని ఆదర్శ్ నగర్ కాలనీలో ఉంది. ఇవాళ (శనివారం) ఉదయం ఫజర్ ప్రార్థనలు చేసేందుకు ప్రజలు మసీదుకు వెళ్లారు. ఇంతలో మసీదు ఆవరణలో బెదిరింపు లేఖ పడి ఉంది. మసీదులో లౌడ్ స్పీకర్లను తొలగించకుంటే మృతదేహాలను లెక్కించేందుకు సిద్ధంగా ఉండాలని లేఖలో రాసుకొచ్చారు. ఈ ఘటనపై వెంటనే న్యాయవాది వసీం మురాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే పీఎస్ ఇన్ చార్జి ముఖేష్ కుమార్ భారీ పోలీసు బలగాలతో మసీదుకు చేరుకున్నారు. కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు ఏసీపీ నరేష్ కుమార్ తెలిపారు. సమీపంలో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించి లేఖ రాసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు.
Read Also: Komatireddy: అప్పుల్లో ఉన్న ఆర్టీసీని గటెక్కించేందుకు పొన్నం ప్రయత్నాలు..
కాగా, ముస్లింలారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి.. మసీదులోని లౌడ్ స్పీకర్ల నుంచి శబ్దం వస్తే, మృతదేహాలను లెక్కించడానికి సిద్ధంగా ఉండండి.. అలాగే, మురాద్‌నగర్‌లోని అన్ని మసీదుల స్పీకర్లను స్విచ్ ఆఫ్ చేయాలి.. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది అని లేఖ రాసిన వ్యక్తి తన పేరును సనాతని అని రాసుకొచ్చాడు. ఇక, ఆ లేఖను స్వాధీనం చేసుకన్న పోలీసులు దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు.