Agri Gold Scam: అగ్రిగోల్డ్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను అప్పగించే ప్రక్రియ ప్రారంభం అయింది. అటాచ్ చేసిన ఆస్తులను బాధితులకు అప్పగించే అవకాశం ఉంది.
Pedakakani: గుంటూరు జిల్లా పెదకాకాని కాలీ గార్డెన్స్ రోడ్డులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలీ ఆశ్రమంలో విద్యుత్ షాక్ తో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు తెనాలికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
Vizag: విశాఖపట్నంలోని గోపాలపట్నం ఇందిరానగర్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తప్పుడు కేసు పెట్టారన్న అవమానంతో ఆనంద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. తన స్నేహితుడి పర్సు ఏడాది కిందట పోవడంతో అది గత రెండు రోజుల క్రితం ఆనంద్ కి దొరకడంతో ఆనంద్ తో పాటు మరో వ్యక్తిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో సోమేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
Vigilance Raids: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సుమారు 73 బంకుల్లో 36 బృందాలు సోదాలు కొనసాగుతున్నాయి. లీగల్ మెట్రాలజీ కింద 6 కేసులు నమోదు చేశారు.
Palnadu: పల్నాడు జిల్లాలో ప్రేమ వివాదం ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రియుడు మోసం చేయటమే కాక చంపేస్తానని బెదిరించడంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వినుకొండకు చెందిన యువతి సెల్ఫీ విడుదల చేసింది.
చెన్నైలో ఘోరం చోటుచేసుకుంది. బాణసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది. టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పేలుడు ధాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఇద్దరు గాయాలపాలయ్యారు. మృతిచెందిన వారిని మహిళా కార్మికులు తిరుమలర్, తిరుమంజు, చెన్పాగం గా గుర్తించారు. Also Read:Skoda Kodiaq: పవర్…
Servant Theft: కాకినాడలో పని చేస్తున్న ఇంట్లో దొంగతనం చేయడానికి దొంగలకు పని మనిషి సహాయం అందించింది. కాకినాడ పట్టణంలోని మహా లక్ష్మీ అనే మహిళ కాళ్లు చేతులు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం, డబ్బులు దోచుకుని తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు పారిపోయారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నకిలీ నోట్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని దొంగ నోట్లను మార్పిడి చేయడమే పనిగా పెట్టుకున్నాయి. నకిలీ నోట్లు ప్రింట్ చేసేందుకు అవసరమైన సామాగ్రిని చైనా నుంచి దిగుమతి చేసుకొని మరి చెలరేగిపోతున్నాయి.
దేశంలో రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో వంచించి దారుణాలకు ఒడిగడుతున్నారు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. బాలికలు, యువతులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. నమ్మకం మాటునే మోసం దాగి ఉంటుందన్నది ఎంత నిజమో తాజాగా జరిగిన సంఘటనే నిదర్శనం. స్నేహం ముసుగులో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. ఈ దారుణ ఘటన కర్ణాటక…
కూటమి ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.. అనధికారికంగా కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలఫోన్ నంబర్స్ కలెక్ట్ చేస్తున్నారని విమర్శించారు.. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ నేతలు, కార్యకర్తల ఫోన్ నంబర్స్ ఇటీవల కలెక్ట్ చేస్తున్నారని ఆరోపించారు.. అయితే, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. ట్యాప్ చేస్తున్నారనే టీడీపీ లీడర్స్ ని కావాలని ఇంకా ఎక్కువ తిడుతున్నరట్టు చెప్పుకొచ్చారు..