Vallabhaneni Vamsi Cases: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది.. ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదు కాగా, తాజాగా మరో మూడు కేసులు పెట్టారు పోలీసులు.. వల్లభనేని వంశీ పై మూడు కేసలు నమోదు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు.. ఆత్మకూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్‌లతో పాటు మళ్లీ గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి..
Read Also: YS Jagan: వైరల్ ఫీవర్‌తో బాధపడుతోన్న జగన్.. అయినా రాజారెడ్డి ఐ సెంటర్ ప్రారంభోత్సవం
అయితే, వంశీపై నమోదైన ఆ మూడు తాజా కేసులు ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. ఆత్మకూరులో ఓ పొలం వివాదంలో వల్లభేని వంశీ ఆదేశాలతో అతని అనుచరుల పేరుతో దౌర్జన్యం చేశారని.. పొలం రిజిస్ట్రేషన్ చేయించారని కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో ఎవరికి చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు.. ఇక, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు లో కేసు నమోదు చేశారు ఆత్మకూరు పోలీసులు. మరోవైపు వీరవల్లిలో ఓ కంపెనీ వచ్చిన సమయంలో రైతులకు పరిహారం ఇవ్వటంలో అవకతవకలకు పాల్పడాని రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు వీరవల్లి పోలీసులు.. ఇదిలా ఉంటే తన భూమిని కభ్జా చేశాడని నిన్న ఓ న్యాయవాది భార్య.. గన్నవరంలో ఫిర్యాదు చేవారు.. తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని మర్లపాలెం మండలంలోని పానకాల చెరువులో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేయడం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా చేయడం వల్లన ప్రభుత్వానికి నష్టం జరిగిందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు గన్నవరం పోలీసులు.