Student Kidnapped: కాకినాడ జిల్లాలోని తునిలో పరమేశ్ అనే బాలుడి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. భాష్యం స్కూల్ లో ఒకటవ తరగతి చదువుతున్న బాలుడుని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుని వెళ్లారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు బాబుకి టానిక్ పట్టించాలని చెప్పి.. పాఠశాల నుంచి బయటకు తీసుకొచ్చారు సదరు దుండగులు.
పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం గుంతపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై కత్తితో దాడి సందర్భంగా.. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఘాటైన విమర్శలు చేశాడు. రాప్తాడులో ప్రశ్నించినవారిపై దాడులు చేస్తున్న పరిటాల కుటుంబానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోలీసులకు సిగ్గుండాలని, పోలీసులు పరిటాల కుటుంబం గుమస్తాలు, వాచ్మెన్లు కాదని విమర్శించారు.
Mahakumbh 2025 : నిర్ణీత పార్కింగ్ స్థలాలు కాకుండా వివిధ ప్రదేశాలలో పార్క్ చేసిన 163 వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. దీనితో పాటు వాహన యజమానుల నుంచి నాలుగు లక్షల రూపాయలకు పైగా జరిమానా వసూలు చేశారు.
ప్రమాదకరమైన ధార్ గ్యాంగ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మకాం వేసిందా.. వరుస దొంగతనాలు ఆ గ్యాంగ్ పనేనా..? పల్నాడు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ప్రశ్న.. పగలంతా రెక్కీ చేస్తారు, తాళాలు వేసిన ఇళ్లకు కాపలా పడుకుంటారు.. సరిగ్గా సమయం కుదిరింది అనుకుంటే ఇల్లు గుల్ల చేసేస్తారు.. సెల్ఫోన్ వాడరు, సిగ్నల్ దొరకనివ్వరు, తమ మొహాలు కనపడనివ్వరు..
దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసు విచారణ ముగిసింది.. ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై దాదాపు 9 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసు అధికారులు.. సీఐ శ్రీకాంత్ నేతృత్వంలోని పోలీసుల టీమ్ ఆర్జీవీని విచారించింది..
తిరుమలలో దంపతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది.. శ్రీవారి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం తెనాలి పట్టణం సుల్తానాబాద్ లో వడ్డెర కాలనీ, సుగాలి కాలనీ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డి.ఎస్.పి బి జనార్ధన రావు నేతృత్వంలో ఈ ప్రాంతంలోని దాదాపు 350 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని నలుగురు సీఐలు, ఎస్ఐలతో సహా 160 మంది దాకా సిబ్బంది…
Wives Fight: చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని చిత్తూరు కండ్రిగలో భర్త మృతదేహం కోసం ఇద్దరు భార్యలు గొడవ పడ్డారు. చిత్తూరు కండ్రిగకు చెందిన విశ్రాంత ట్రాన్స్కో డీఈ సుబ్రహ్మణ్యం గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉండగా.. ఇటీవల పరిస్థితి విషమించడంతో రెండో భార్య జానకి, తనయుడు నవీన్ కుమార్ స్విమ్స్కు తీసుకెళ్లారు.
Bomb Threat: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో గల పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ రోజు (ఫిబ్రవరి 5) ఉదయం నాలుగు ప్రైవేట్ స్కూల్స్కు ఈ బెదిరింపులు వచ్చాయి.