Vallabhaneni Vamsi Wife: విజయవాడలోని కోర్టు దగ్గర వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ మాట్లాడుతూ.. మూడు రోజులు కోర్టు అనుమతించిన పోలీస్ కస్టడీ తర్వాత మళ్లీ వంశీని న్యాయస్థానం నుంచి సబ్ జైలుకు తరలించడం జరిగిందన్నారు. మూడు రోజులు పోలీసులు కస్టడీలో నా భర్తను అర్థం పర్థం లేని కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారు అని ఆరోపించింది. జైలులో ఆనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆయనను ఆస్తమా ఇబ్బంది పెడుతుంది.. వంశీ పడుతున్న ఆరోగ్య సమస్యలను జడ్జి ముందు విన్నవించుకోవడం జరిగింది.. నేను తాత్కాలికమైన జడ్జిని రెగ్యులర్ జడ్జి వచ్చిన తర్వాత మీరు పిటీషన్ వేసుకోవచ్చని చెప్పారు అని వల్లభనేని వంశీ భార్య వెల్లడించింది.
Read Also: Israel: ఇజ్రాయిల్‌లో ఉగ్రదాడి.. పాదచారులపైకి వాహనం..
ఇక, సంబంధం లేని కేసులతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇబ్బంది పెడుతున్నారు అని లాయర్ తానికొండ చిరంజీవి తెలిపారు. ఈ కేసులో బలం లేకపోయినా అర్థం లేని వాదనలు చేస్తున్నారు.. న్యాయస్థానం ముందు ఇవేమీ నిలిచే కేసులు కావు.. మూడు కాదు పది కేసులు అయినా సరే మేము కోర్టు ద్వారానే తేల్చుకుంటాం.. చట్టం ముందు అందరూ సమానులే అని వంశీ తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు.