Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ కిడ్నాప్ చేశాడని పోలీసులు కేసు నమోదు చేసిన సత్యవర్ధన్ 164 స్టేట్ మెంట్ ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సత్యవర్ధన్ స్టేట్ మెంట్ కావాలని న్యాయస్థానాన్ని కోరారు. గన్నవరం టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా సత్యవర్ధన్ ఉన్నారు.. అయితే, ఈ కేసుతో తనకి సంబంధం లేదని ఫిబ్రవరి 10వ తేదీన కోర్టులో సత్యవర్ధన్ అఫిడవిట్ దాఖలు చేశారు.
Read Also: Justice Bela Trivedi: ‘‘ఆమె జైలులోనే ఉండనివ్వండి, బరువు తగ్గుతుంది’’..
ఇక, ఆ తర్వాత రోజే సత్యవర్ధన్ ను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన అనుచరులు కిడ్నాప్ చేసినట్టు సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ అరెస్టు తర్వాత ఘటనపై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తి ఎదుట సత్యవర్థన్ 164 స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇక, కేసులో కీలకంగా మారిన సత్యవర్ధన్ స్టేట్ మెంట్ కావటంతో దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు.