Posani: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. మార్చ్ 3వ తేదీ బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేయడానికి ఆయా స్టేషన్లకు చెందిన పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి కొన్ని జిల్లాలకు చెందిన పోలీసులు ఇప్పటికే పోసానిని తమకు అప్పగించాలంటూ పీటీ వారెంట్ దాఖలు చేస్తున్నారు. అయితే, సోమవారం నాడు రైల్వే కోడూరు కోర్టులో అనంతపురం పోలీసులు పిటి వారెంట్ ఫైల్ చేయనున్నారు.
Read Also: Bhupalapally: ప్రతాపగిరి అడవుల్లో పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
అయితే, రైల్వే కోడూర్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులు పీటీ వారెంట్ వేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. గత నెల 28వ తేదీన రైల్వేకోడూరు న్యాయస్థానం దగ్గర అనంతపురం, రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు పోసానిని అరెస్ట్ చేయడం కోసం పోటీ పడ్డారు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించడంతో వెనుదిరిగారు.
Read Also: Chef Mantra Project K: ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమైపోయిన సుమ కుకింగ్ షో..
కాగా, రాజంపేట సబ్ జైలులో పోసాని కృష్ణ మురళి ఉన్నారు. జైలులో అతడికి ప్రత్యేక గది కేటాయించిన అధికారులు తెలిపారు. నిన్న (ఫిబ్రవరి 28) రాత్రి పోసానికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే, పోసానికి బెయిల్ ఇవ్వాలని రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ, రేపు సెలవు కావడంతో సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో సోమవారం నాడే పిటీ వారెంట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.