Pedakakani: గుంటూరు జిల్లా పెదకాకాని కాలీ గార్డెన్స్ రోడ్డులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలీ ఆశ్రమంలో విద్యుత్ షాక్ తో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు తెనాలికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మరొకరు దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.. నాలుగో వ్యక్తి వీరిని కాపాడేందుకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ఇక, మృతుల డెడ్ బాడీలను గుంటూరులోని జీజీహెచ్ కు పోలీసులు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం ఎలా జరిగింది? అసలు కారణాలు ఏమిటి అనే దానిపై పెదకాకాని పోలీసులు, ఎలక్ట్రికల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: PM Modi: లాలూ ‘‘జంగిల్ రాజ్’’ నేత.. బీహార్ ఎప్పటికీ వారిని క్షమించదు..
అయితే, గోశాల దగ్గర నలుగురు చనిపోయిన సంపులను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోశాలలో 70 ఆవులున్నాయి.. ఆవు మూత్రం, పేడను పిట్ లో డంప్ చేస్తారు.. సంపును రెగ్యులర్ గా శుభ్రం చేస్తారు.. సంపు నుంచి వేస్ట్ ను తొలగిస్తున్న సమయంలో మోటారు రిపేర్ తో విద్యుత్ షాక్ కు గురై నలుగురు చనిపోయారు.. ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు వెళ్ళడంతోనే ఈ నలుగురు మరణించారు.. దురదృష్టకర సంఘటన చోటు చేసుకుందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు.