Vizag: విశాఖపట్నంలోని గోపాలపట్నం ఇందిరానగర్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తప్పుడు కేసు పెట్టారన్న అవమానంతో ఆనంద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. తన స్నేహితుడి పర్సు ఏడాది కిందట పోవడంతో అది గత రెండు రోజుల క్రితం ఆనంద్ కి దొరకడంతో ఆనంద్ తో పాటు మరో వ్యక్తిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో సోమేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆనంద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరం అంగీకరించమని ఒత్తిడి తేవడంతో.. తనపై దొంగతనం కేసు అంటగట్టారనే మనస్థాపంతో ఆదివారం నాడు మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి ఆరోపించింది.
Read Also: Sukumar: దుబాయ్ లో సుకుమార్ క్యాంపు !!
ఇక, కేవలం సోమేశ్ తప్పుడు కేసు పెట్టడం వలన తమ కుమారుడు ఆనంద్ ఆత్మహత్యకి పాల్పడ్డాడని మృతుడి తల్లి పేర్కొంది. తమకు న్యాయం చేయాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర బంధువులు ఆనంద్ మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు. అయితే, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులకు పోలీసులు సర్ధి చెప్పడంతో పాటు ఆనంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.