Fake Darshan Tickets: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి వారి నకిలీ దర్శనం టికెట్లను అధిక రేట్లకు భక్తులకు అమ్మిన వారిపై దేవస్థానం సీఎస్ఓ మదుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్లు అమ్ముతున్న కేటుగాళ్లపై కేసు నమోదు చేశారు.
Posani: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. మార్చ్ 3వ తేదీ బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేయడానికి ఆయా స్టేషన్లకు చెందిన పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఓబులవారిపల్లె పోలీసులు.. పోసానిని సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడి.
Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ కిడ్నాప్ చేశాడని పోలీసులు కేసు నమోదు చేసిన సత్యవర్ధన్ 164 స్టేట్ మెంట్ ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
Vallabhaneni Vamsi Wife: విజయవాడలోని కోర్టు దగ్గర వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ మాట్లాడుతూ.. మూడు రోజులు కోర్టు అనుమతించిన పోలీస్ కస్టడీ తర్వాత మళ్లీ వంశీని న్యాయస్థానం నుంచి సబ్ జైలుకు తరలించడం జరిగిందన్నారు. మూడు రోజులు పోలీసులు కస్టడీలో నా భర్తను అర్థం పర్థం లేని కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారు అని ఆరోపించింది.
Gorantla Madhav: అనంతపురం జిల్లాలో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చారు. సెక్షన్ 35/ త్రి బీఎన్ఎస్ కింద గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారు. మార్చ్ 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని మాజీ ఎంపీ మాధవ్ కు నోటీసులు అందజేశారు.
Posani Krishna Murali: అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో లో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విచారణ కొనసాగుతుంది. దాదాపుగా ఐదు గంటల పాటు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐ వెంకటేశ్వర్లు విచారిస్తున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది.. ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదు కాగా, తాజాగా మరో మూడు కేసులు పెట్టారు పోలీసులు.. వల్లభనేని వంశీ పై మూడు కేసలు నమోదు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు.. ఆత్మకూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్లతో పాటు మళ్లీ గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి..
Agri Gold Scam: అగ్రిగోల్డ్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను అప్పగించే ప్రక్రియ ప్రారంభం అయింది. అటాచ్ చేసిన ఆస్తులను బాధితులకు అప్పగించే అవకాశం ఉంది.
Pedakakani: గుంటూరు జిల్లా పెదకాకాని కాలీ గార్డెన్స్ రోడ్డులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలీ ఆశ్రమంలో విద్యుత్ షాక్ తో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు తెనాలికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.