Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఓబులవారిపల్లె పోలీసులు.. పోసానిని సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడి. పోసాని కృష్ణ మురళిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఇక, పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Amitabh Bachchan : రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్..
అయితే, పార్వతీపురం జిల్లాలోని పాలకొండ పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణ మురళిపై 2024లో కేసు నమోదు అయింది. ఈ నెల 12వ తేదీన పాలకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎదుట హాజరు కావాలంటూ ఫిబ్రవరి 7వ తేదీన నోటీసులు జారీ చేశారు. కానీ, పోసాని విచారణకు సహకరించడం లేదని ఓబులవారిపల్లి పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 14 కేసులు నమోదు అయ్యాయి. నాలుగు కేసులలో ఆయనకి వ్యతిరేకంగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.. పోసానిని హైదరాబాదులో అరెస్టు చేసిన సమయంలో అరెస్ట్ ఇంటిమేషన్ కాపీని కుటుంబ సభ్యులు తీసుకోలేదు.. అందుకే ఇంటిమేషన్ కాపీని ఆయన కొడుకు వాట్సాప్ కు పంపించామని రైల్వే కోడూరు కోర్టుకు ఇచ్చిన పోసాని రిమాండ్ కాపీలో పేర్కొన్న వివరాలను పోలీసులు వెల్లడించారు.
Read Also: TG Inter Exams 2025: మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లపై సమీక్షించిన సీఎస్
ఇక, ఉమ్మడి విశాఖ జిల్లాలో పోసాని కృష్ణ మురళిపై మరో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. విశాఖ వన్ టౌన్, పద్మనాభం, పాడేరు, నర్సీపట్నం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. వన్ టౌన్లో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కంప్లయింట్ చేయగా.. పద్మనాభంలో చిన్ని వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. ఇక, నర్సీపట్నంలో కే. మరుడయ్య, పాడేరులో పాండు రంగ స్వామి ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు.