AP DGP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్ ఇచ్చారు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడులను ఉక్కుపాదంతో అణిచి వేస్తామన్నారు.
Vijayasai Reddy: మాజీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి (మార్చ్ 12వ తేదీన) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు.
Vizag: విశాఖపట్నంలో ఎన్నారై మహిళ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఎన్టీవీ వరుస కథనాలపై పోలీస్ యంత్రాంగం కదిలింది. ఇప్పటి వరకు కేసును నీరుగార్చే ప్రయత్నంలో ఉండగా.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వరుసగా కథనాలు ప్రసారం అయ్యేసరికి పోలీస్ యంత్రాంగం ఒత్తిడిలోకి పోయింది.
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీని మరోసారి విచారణ చేసేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది
Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు.
ఈరోజు, రేపు రెండు రోజుల పాటు పోసాని కృష్ణ మురళిని నరసరావుపేట పోలీసుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. పోసాని కృష్ణ మురళి కోరితే.. న్యాయవాది సమక్షంలో అతడ్ని విచారణ చేయాలంటూ పోలీసుకు న్యాయస్థానం సూచించింది.
Child Trafficking Case: హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి వందన అనే మహిళను అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాదులో అమ్మినట్లు గుర్తించారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో మద్యం మత్తులో కారు బీభత్సం సృష్టించింది. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ దగ్గర ద్విచక్ర వాహన దారుని ఢీకొట్టిన కారు.. దీంతో పాటు మద్యం మత్తులో యువతులు హల్ చల్ చేశారు.