Holi Celebrations: హైదరాబాద్ నగర వ్యాప్తంగా హోలీ వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. సప్తవర్ణాల్లో కుర్రకారు హుషారుగా పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేస్తున్నారు. ఒకరికి ఒకరు ముఖానికి సహజ సిద్ధమైన రంగులు అద్దుకుని కేరింతలు కొడుతున్నారు.
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందటం పట్ల మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Verity Festival: నిజామాబాద్ జిల్లాలోని సాలూరా మండలం హున్సలో పిడిగుద్దులాట ఆగడం లేదు. హోలీ పండుగ రోజు నిర్వహించే ఆటకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. గ్రామంలోని యువకులు ఈ ఆటను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు.
Hit And Run Case: హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. జగద్గీరిగుట్ట, షాపూర్ లలో వరుస రోడ్డు ప్రమాదాలు చేసిన కారు.. జగద్గీరి గుట్ట ఔట్ పోస్ట్ ప్రయాణికులను గుద్ది ఆపకుండా కారు వెళ్లిపోయింది.
Crime: హైదరాబాద్ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ సైట్ త్రీలో భార్య పద్మ మీద అనుమానంతో భర్త నరేంద్ర హత్య చేశాడు.
BRS MLC Pochampally: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో కోడి పందాలు, క్యాసినో కేసులో నోటీసులు అందజేశారు.
AP DGP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్ ఇచ్చారు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడులను ఉక్కుపాదంతో అణిచి వేస్తామన్నారు.
Vijayasai Reddy: మాజీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి (మార్చ్ 12వ తేదీన) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు.
Vizag: విశాఖపట్నంలో ఎన్నారై మహిళ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఎన్టీవీ వరుస కథనాలపై పోలీస్ యంత్రాంగం కదిలింది. ఇప్పటి వరకు కేసును నీరుగార్చే ప్రయత్నంలో ఉండగా.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వరుసగా కథనాలు ప్రసారం అయ్యేసరికి పోలీస్ యంత్రాంగం ఒత్తిడిలోకి పోయింది.