Transgender Murder Case: అనకాపల్లిలో ట్రాన్స్ జెండర్ దీపు (దిలీప్ కుమార్) హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పొదలాడ గ్రామానికి చెందిన నిందితుడు బండి దుర్గా ప్రసాద్ (బన్నీ)ని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు సంవత్సరాల నుంచి ట్రాన్స్ జెండర్ దీపూతో సహజీవనం చేసిన నిందితుడు.. మరొకరిని పెళ్లి చేసుకునేందుకు దీపూ అడ్డుగా ఉందని టవల్ తో గొంతు బిగించి హత్య చేశాడని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక, ఆ తర్వాత దీపూని ముక్కలు ముక్కలుగా నరికి.. మూడు భాగాలుగా వేరు చేసి స్కూటీ, బుల్లెట్ బండిపై తీసుకు వెళ్లి మూడు ప్రదేశాల్లో నిందితుడు పడేశాడు అని పోలీసులు వెల్లడించారు.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా..
అయితే, ఈ హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడి బండి దుర్గా ప్రసాద్ ను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ట్రాన్స్ జెండర్ దీపు హత్య కేసులో వేరే ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.