ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు 65 ఏళ్ల వయసు ఉందని అనారోగ్యంతో బాధపడుతున్నానని పిటిషన్ లో పేర్కొన్నారు. తాను వైద్యం కోసమే అమెరికా వెళ్ళినట్టు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశానని ప్రభాకర్ రావు తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవంటూ హైకోర్టుకు ప్రభాకర్ రావు తెలిపారు. అమెరికా వెళ్ళినా దర్యాప్తు అధికారితో టచ్ లో ఉన్నాను అంటు ప్రభాకర్ రావు వెల్లడించారు.
Also Read:KTR: చేయని శపథం లేదు.. ఆడని అబద్దం లేదు.. అక్షరాల 420 అబద్దపు హామీలు
ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్ రావు పిటిషన్ లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభాకర్ రావు తెలిపారు. కాగా ఇటీవల ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. రెడ్ కార్నర్ నోటీస్ పై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం వచ్చింది. వీలైనంత త్వరగా భారత్ కు ఇద్దరిని రప్పించేందుకు కేంద్ర హోం శాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. గతేడాది మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ విదేశాలకు పారిపోయారు.