Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
- ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్‌ను భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమం..
- ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్లు ప్రకటన..
- రెడ్ కార్నర్ నోటీసుపై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ లను భారత్ కు రప్పించేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్లు ప్రకటన విడుదల చేసింది. రెడ్ కార్నర్ నోటీస్ పై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం వచ్చింది. వీలైనంత త్వరగా భారత్ కు ఇద్దరిని రప్పించేందుకు కేంద్ర హోం శాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇక, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల గురించి డీహెచ్ఎస్ కు సమాచారం అందగానే అమెరికాలో ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికా నుంచి నిందితులు డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్ కు పంపించే ఛాన్స్ ఉంది.
Read Also: Sunita Williams: చిరునవ్వుతో భూమిపై అడుగుపెట్టిన సునీత.. వీడియో వైరల్
Also Read
అయితే, గతేడాది మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ విదేశాలకు పారిపోయారు. ఈ కేసు విచారణ ముందుకు సాగాలన్నా.. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయంపై ఆధారాలు బహిర్గతం కావాలన్నా వారిని విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారంటూ ఇటీవల కోర్టు ప్రశ్నించడంతో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై పోలీసులు ప్రత్యేకంగా నజర్ పెట్టారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!