Hyderabad: పోచారం ఐటీ కారిడార్‌లో సైకో వీరంగం.. దాడిలో చిన్నారి మృతి
- పోచారం ఐటీ కారిడార్‌లో సైకో వీరంగం
- సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది
- సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో వీరాంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన జగేశ్వర్ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం మునిసిపాలిటీలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన హప్నహెమ్‌బ్రూమ్(30) అనే యువకుడు శుక్రవారం అక్కడే పనిలో చేరాడు. అయితే హప్న ఉన్నట్టుండి సైకోగా మారాడు.
Also Read:Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు..
Also Read
లేబర్ క్యాంప్‌లో ఆడుకుంటున్న చిన్నారి రియాకుమారి తలపై హప్న బీరు సీసాతో కొట్టి పరుగు తీశాడు. ఆకస్మిక ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. జోడిమెట్ల వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి వచ్చిన సైకో వాహనాలపై రాళ్లు విసిరుతూ పరుగులు తీశాడు. దాడిలో రెండు కార్ల అద్దాలు, ఒక ఆటో ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడుతున్న సైకోను స్థానికులు బంధించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!