ఆపరేషన్ ముస్కాన్ లో దొరికిన మైనర్లు పరారయ్యారు.పట్టుబడ్డ బాలలను సైదాబాద్ లోని జువైనల్ హోమ్ లో ఉంచారు సీడబ్ల్యూసీ సిబ్బంది. జువైనల్ హోమ్ నుండి పారిపోయారు పది మంది బాలురు. ఆదివారం సెలవు దినం, సిబ్బంది తక్కువగా ఉంటారని పారిపోయేందుకు ప్లాన్ వేశారు ఆ పది మంది బాలురు. నిన్న ఉదయం గేటు వద్ద సిబ్బంది ఒక్కడే ఉండటాన్ని గమనించి అతనిపై దాడి చేసి గేట్ తాళం తీసుకొని పారిపోయారు పది మంది. ఆ గేట్ దగ్గర…
సీఎం కాన్వాయ్ కు అడ్డు వచ్చిన కేస్ లో ఇద్దరు మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్ ఇస్తున్నారు. శనివారం సచివాలయం నిర్మాణ పనులు చూసేందుకు వెళ్లారు సీఎం కేసీఆర్. పోలీసుల బందోబస్తు దాటుకుని కాన్వాయ్ ఫాలో అయ్యి అడ్డు వచ్చారు ఇద్దరు యువకులు. ఓవర్ స్పీడ్ తో బైక్ నడిపిన యువకులను చూసి కాన్వాయ్ ఆగింది. ఆ ఇద్దరు యువకుల పై కేస్ నమోదు చేసిన పోలీసులు ఆ బైక్ కూడా దొంగలించిన వాహనం గా గుర్తించారు. వారం…
ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం చేసారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించిన చీటర్స్… అమాయక ప్రజలను ఆన్లైన్ బిజినెస్ పేరుతో టార్గెట్ చేసారు. చైనాకి చెందిన సైబర్ చీటర్స్ కి నకిలీ కంపెనీల పేరుతో కరెంట్ అకౌంట్స్ తీసి ఇచ్చారు హైదరాబాద్ వాసులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు ఓ వ్యక్తి. దాంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసాడు…
కరీంనగర్ జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సానిటీజర్ తాగి వివాహిత దివ్య ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమెను అడ్డుకున్న కుటుంబ సభ్యులు… పోలీస్ వాహనం లో హాస్పిటల్ కు తరలించారు. భర్త పై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆందోళన చేస్తుంది. బాధితురాలికి తెలియకుండా మరో వివాహం చేసుకున్నాడు భర్త మురళీ కృష్ణ. 2007లో దివ్యకు తెలియకుండా సుజాతను వివాహం చేసుకున్నాడు మురళి కృష్ణ. 2017లో దివ్యను రెండో వివాహం చేసుకుని…
కొడుకు, కోడలి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజు పోలీసులను ఆశ్రయించారు… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం 4లో నివాసముంటున్నారు మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణ రాజు… ఆయన వయస్సు 75 ఏళ్లు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారాయన.. ఆయన భార్య జానకి గతేడాది మార్చిలో అనారోగ్య సమస్యలతో మృతిచెందారు.. అయితే, కొడుకు కేవీఎస్ రాజు, కోడలు కంతేటి పార్వతి నుంచి తనకు ప్రాణహాని ఉందంటున్నారు మాజీ…
భారత్-పాక్ సరహిద్దులతో మొదట కలలం సృష్టించిన డ్రోన్లు.. ఆ తర్వాత జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై దాడికే ఉపయోగించారు.. ఇక, అప్పటి నుంచి ఎక్కడ డ్రోన్లు కదలినా.. అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇవాళ ఎర్రకోట సమీపంలో డ్రోన్ ఎగరడంతో కలకలమే రేగింది.. వెంటనే ఆ డ్రోన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట వెనుక భాగంలో విజయ్ ఘాట్ మీదుగా డ్రోన్ ఎగిరింది.. ఈ ప్రాంతంలో వెబ్ సిరీస్ షూటింగ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చినా.. డ్రోన్‌కు మాత్రం అనుమతి లేదు..…
గుంటూరులో సంచలనం రేపిన రేవ్ పార్టీ వ్యవహారం పోలీసుల వ్యవహారశైలిని బయటపెట్టింది. లక్ష్మీపురంలోని ఓ బిల్డింగ్ నుంచి… అరుపులు, కేకలు వినిపించడంతో… విసిగిపోయిన స్థానికులు… అక్కడికి వెళ్లి చూశాడు. రేవ్ పార్టీ జరుగుతుండడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, అక్కడున్న పోలీస్ అధికారి… వారికి వార్నింగ్ ఇచ్చి పంపారు. ఇలా కాదనుకున్న స్థానికులు… ఆ బాగోతాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత.. పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పాతిక మంది గుంపు తమ ఇంటి దగ్గర రేవ్…
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తనపై అత్యాచారం చేశాడంటూ ట్రైనీ ఎస్సై ఆరోపించారు.. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీపీ తరుణ్ జోషి.. ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తనను ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగికంగా వేధించినట్లు అదే పీఎస్‌కు చెందిన మహిళా ట్రైనీ ఎస్సై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.. సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ పేరుతో ఒంటరిగా తనను…
గత నెల 25న జరిగిన హత్యకేసును శ్రీకాకుళం పోలీసులు చేధించారు. శ్రీకాకుళం టౌన్ సమీపంలోని విజయాదిత్య పార్క్ లో హత్యకు గురయ్యాడు మాజీ ఆర్మీ ఉద్యోగి చౌదరి మల్లేశ్వరరావు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. మల్లేశ్వరరావును హతమార్చాడు సొంత బావమరిది సీపాన అప్పలనాయుడు. విజయాదిత్య పార్క్ కు పిలిపించి మరో ఐదుగురితో కలిసి హత్య చేసాడు అప్పలనాయుడు. ఈ హత్యకు ఆరులక్షల ఒప్పందం చేసాడు. ముందుగా 4 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు.…