మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాల పై మరోమారు స్పందించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. పక్కరాష్ట్రంలో దిశ ఘటనలో సీపీ సజ్జనార్ చేసిన ఎన్ కౌంటర్ ను అందరూ స్వాగతించాలి అన్నారు. అలాగే అమ్మాయిల శీలాన్ని చెరచిన వాడు మగాడు కాదు మృగాడు. సజ్జనార్ చేసిన పని సమాజం నుంచి పుట్టుకొచ్చిన ఒక గొప్ప పాలసీ. న్యాయానికి న్యాయం జరగనపుడు సమాజంలోంచి ఒక న్యాయం పుట్టుకొస్తుంది . అదే సమాంతర న్యాయం. సమాంతర న్యాయంలో నో లా, నో రూల్స్ అని తెలిపారు. ఒక మహిళను చెరచిన వాడికి రక్షణ దేనికి …టైమ్ వేస్ట్. అలాంటి వారిని శిక్షించేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలందరూ దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. స్త్రీల దగ్గర దిశ యాప్ ఉంటే … డీజీపీ , సీఎం వారికి తోడు ఉన్నట్లే. దిశ యాప్ పై మరింత విస్త్రృత ప్రచారం జరగాలి అని పేర్కొన్నారు.