కేరళ అమ్మాయి హైదరాబాద్ యువకులనే టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో వల వేస్తుంది. కొన్ని రోజులు ఎంజాయ్ చేసి. పెళ్లి చేసుకుందామని నమ్మిస్తుంది. అడిగిన ప్రతిసారి డబ్బులు ఇవ్వాలి.. లేదంటే అక్రమ కేసులు పెట్టి జైలు పాలుచేస్తుంది. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు, భర్తతో జీవనం సాగిస్తూ… ఈ మోసాలకు పాల్పడుతోంది కిలాడి లేడి. ఈ లేడిపై పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. ఈ మహిళా చేతిలో మోసపోయిన బాధితుడు న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. స్పందించిన హెచ్చార్సీ నవంబర్ 10లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాచకొండ పోలీసు కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు.