ఆంధ్రప్రదేశ్‌లో నాటుబాంబులు కలకలం సృష్టించాయి.. మద్యం మత్తులో ఓ వ్యక్తి నాటుబాంబులతో వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతిలోని పాకాల మండలం వల్లివేడు పంచాయతీలో నాటుబాంబుల తీవ్ర కలకలం రేపాయి… మద్యం మత్తులో పది నాటుబాంబులతో వీరంగం సృష్టించాడు కృష్ణయ్య అనే వ్యక్తి… దీంతో.. ఓ నాటుబాంబు పేలింది. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. అయితే, ఆ నాటుబాంబు పేలినా.. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి కృష్ణయ్య పరారయ్యాడు.. నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.