సీఎం కాన్వాయ్ కు అడ్డు వచ్చిన కేస్ లో ఇద్దరు మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్ ఇస్తున్నారు. శనివారం సచివాలయం నిర్మాణ పనులు చూసేందుకు వెళ్లారు సీఎం కేసీఆర్. పోలీసుల బందోబస్తు దాటుకుని కాన్వాయ్ ఫాలో అయ్యి అడ్డు వచ్చారు ఇద్దరు యువకులు. ఓవర్ స్పీడ్ తో బైక్ నడిపిన యువకులను చూసి కాన్వాయ్ ఆగింది. ఆ ఇద్దరు యువకుల పై కేస్ నమోదు చేసిన పోలీసులు ఆ బైక్ కూడా దొంగలించిన వాహనం గా గుర్తించారు. వారం రోజుల క్రితం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో చోరీకి గురైంది బైక్. తాము వేరే వ్యక్తి నుండి కొనుకున్నమని పోలీసులకు తెలిపారు యువకులు. అయితే ఆ ఇద్దరు మైనర్లు కావడంతో కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు.