రియల్టర్ భాస్కర్ రెడ్డి కేసులో నిందితులు నేడు పోలీస్ కస్టడీకి రానున్నారు. నలుగురు నిందితులను ఏడురోజుల కస్టడీకి కోరారు పోలీసులు. దాంతో మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజు, ఆర్ఎంపి డాక్టర్ నలుగురు నిందితులను పోలీస్ కస్టడికి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. మరికాసేపట్లో చెంచల్ గూడ జైల్ నుండి నిందితులను కస్టడికి తీసుకోనున్నారు పోలీసులు. హత్యయకు కారణాలు, కీలక సూత్రదారుల పాత్రపై విచారించనున్నారు పోలీసులు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే పాత్రపై విచారించనున్న పోలీసులు… విదేశీ నగదు, గుప్తనిధులు, బాబా అక్రమాలపై ఆరా తీయనున్నారు. సూత్రదారి త్రిలోక్ నాధ్ బాబా కోసం గాలింపు ముమ్మరం చేసారు. బాబాతో సహా కార్తిక్ అనే మరో నిందితుడు కేరళలో ఉన్నట్టు సమాచారం.