ఈ మధ్యకాలంలో లోన్ యాప్ నిర్వహకులు రెచ్చిపోతున్నారు. తీసుకున్న లోన్ ను పూర్తిగా చెల్లించిన కూడా ఇంకా చెల్లించాలని అడ్డగోలుగా వ్యవహరిస్తు.. అమాయకుల ప్రాణాలను తీసుకుంటున్నారు. తమ ఇష్టారీతిన వడ్డీలు వేస్తూ.. లోన్ తీసుకున్న వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. లోన్ చెల్లించకపోతే మీ పర్సనల్ ఫోటోలను మార్పింగ్ చేసి మీ బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటు బెదిరింపులకు దిగుతున్నారు. అయితే, ఈ లోన్ యాప్ నిర్వహకుల బాధను భరించలేక చాలా మంది ఆత్మ హత్యలు చేసుకున్నారు. లోన్ యాప్స్ జోలికి వెళ్లొద్దని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇక, తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సిద్ధిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
Read Also: IRCTC Tour Package: రూ.25వేల కంటే తక్కువ ధరకే సిమ్లా, మనాలి ప్యాకేజీ.. ఎంజాయ్
ఇక, సిద్దిపేట జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. లోన్ తీసుకున్న వారికి న్యూడ్ ఫోటోలు పంపి బెదిరింపులకు దిగుతున్నారు. కుకునూర్ పల్లిలో ఆన్ లైన్ యాప్ నుంచి ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. తీసుకున్న లోన్ మొత్తం చెల్లించిన ఇంకా నగదు చెల్లించాలని ఫోన్ చేసి లోన్ యాప్ నిర్వహకులు బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. లేకపోతే న్యూడ్ ఫోటోలు బంధువులకు పంపి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు. భయంతో 5 వేల రూపాయలు ఎక్కువ బాధితుడు చెల్లించాడు.
Read Also: WI vs IND 3rd T20: నేడు వెస్టిండీస్‌తో మూడో టీ20.. ఓడితే అంతే ఇక! 2016 తర్వాత
సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోన్ వచ్చిందని ఓ వ్యక్తికి లింక్ రూపంలో మెసేజ్ ను గుర్తు తెలియని వ్యక్తులు పింపించారు. లింక్ పై క్లిక్ చేయగానే అకౌంట్ లో నుంచి 5 వేల రూపాయలు మాయమైనట్లు బాధితుడు పేర్కొన్నాడు. కస్టమర్ కేర్ కి ఫోన్ చేయగా ఎక్కువ మాట్లాడితే న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.