ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషికి గౌరవ సూచకంగా.. తెలంగాణ సర్కార్ ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం దీనిపై వివాదం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరపడంపై యాంటీ టెర్రరిజం ఫోరం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. గద్దర్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయడం పోలీస్ అమరవీరులను అగౌరవ పరచడమేనని ఏటీఎఫ్ కన్వీనర్ శశిధర్ పేర్కొన్నారు.
Read Also: Viral Marriage News: అక్కను పెళ్లి చేసుకునేందుకు వచ్చి.. చెల్లితో పారిపోయిన ఘనుడు
గద్దర్ తన విప్లవ పాటలతో వేలాది మంది యువకులను నక్సలిజం వైపు మళ్లించారని ఏటీఎఫ్ కన్వీనర్ శశిధర్ తెలిపారు. కన్సలిజం వేలాది మంది పోలీసులను బలి తీసుకుంది.. ప్రభుత్వ నిర్ణయం పోలీస్ బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తుందని ఏటీఎఫ్ వెల్లడించింది. నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసుల త్యాగాలను అవమానిండం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుందని ఎటీఎఫ్ కన్నీనర్ శశిధర్ చెప్పారు. అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యం కాదు.. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏటీఎఫ్ కన్వీనర్ శశిధర్ డిమాండ్ చేశారు.
Read Also: Anakapalle Girl Missing: యువతి మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. అసలు కారణం ఇదే!
అయితే, మరికాసేపట్లో ప్రజాకవి గద్దర్ పార్థివదేహం ఎల్బి స్టేడియం దగ్గర నుంచి తరలించనున్నారు. గన్ పార్క్, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం మీదుగా ఆయన నివాసానికి చేరుకోనుంది. ఇక, గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహా బోధి విద్యాలయంలోనే అంత్యక్రియలు జరుగనున్నాయి. గద్దర్ పార్థివదేహాన్ని బంధువులు, అభిమానులు, ఉద్యమకారులు కడసారి చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు.