సంగారెడ్డి జిల్లాలో కేంద్రంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. ఇక, వరుసగా ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 2022-23 ఏడాది వ్యవధిలోనే ఇప్పటి వరకు నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. చదువుల్లో ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు తనువుచాలిస్తున్నారు.
Read Also: Itchy Eyes Home Remedies: కళ్ల దురదతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ హోం రెమెడీస్‌తో ఇట్టే చెక్ పెట్టండి!
మరికొంతమంది స్టూడెంట్స్ పరీక్షల్లో ఫెయిల్ కాగానే చావే శరణ్యం అనుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలకే డిప్రెషన్ లోకి విద్యార్థులు వెళ్లిపోతున్నారు. గతేడాది ఆగస్టు 31న క్యాంపస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా విద్యార్థి రాహుల్ మంచానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్ లోని జోధ్ పూర్ కి చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మేగ్ కపూర్ సంగారెడ్డిలో ఓ లాడ్జిపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇక, ఈ నెల 17న క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి వైజాగ్ లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ శవమై తేలాడు.
Read Also: Loan App: సిద్దిపేట జిల్లాలో లోన్ యాప్ ఆగడాలు.. అప్పు తీసుకున్న వారికి న్యూడ్ ఫోటోలు
ఇక, ఒడిషాకి చెందిన విద్యార్థిని మమైతా నాయక్ ఇవాళ( మంగళవారం ) క్యాంపస్ లోని రూమ్ లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిన్న( సోమవారం ) ఐఐటీ క్యాంపస్ లో మమైతా నాయక్ M.TECH చదువుతుంది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నానని సూసైడ్ నోట్ లో ఆమె పేర్కొంది. విద్యార్థిని డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఇక, విద్యార్థులు వరుసగా ఆత్మహత్య ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నారు. కేవలం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లోనే విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.