కేరళలోని తిరువనంతపురం జిల్లా కట్టకడలో 15 ఏళ్ల ఆదిశేఖర్ అనే బాలుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. అయితే ఆగస్టు 30వ తారీఖున ఆ బాలుడు తన స్నేహితులతో ఆడుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పూవాచల్లోని లింకోడ్ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఎలక్ట్రిక్ కారు అతడిని ఒక్క సారిగా ఢీకొట్టింది.
రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించాలని సిద్ధార్థ లూద్రా నోటీసు ఇచ్చాడు. తిరస్కరణపై వాదనలకు న్యాయమూర్తి హిమ బిందు అనుమతి ఇచ్చింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగుతున్నాయి.
గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గర పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. కాసేపట్లో గన్నవరం విమానాశ్రయంకు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. అయితే పవన్ ను బయటకు వెళ్ళకుండా ఆపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో గొడవ చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. సీపీ సమక్షంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టారని వారు ఆరోపిస్తున్నారు.. ఏబీవీపీ విద్యార్థులు 4న డోర్ పగులగొట్టి వీసీ కార్యాలయంలోకి చొరబడ్డారు అని సీపీ తెలిపారు.
రూ.50 కోసం పుర్రెలు పగిలేటట్లు కొట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో దాదాపు 10 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన ఘజియాబాద్‌లోని ఖిందౌడా గ్రామంలో జరిగింది.
డీగ్ జిల్లాలోని గోపాల్‌గఢ్ పట్టణంలో సుమారు రూ.35 లక్షలతో నింపిన ఏటీఎం మిషన్‌ను దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు పప్పి అలియాస్ మక్సూద్ను అరెస్టు చేశారు.