హర్యానాలోని హిసార్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ను చిత్రహింసలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముందుగా కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి చితకబాదారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కరెంట్ షాక్ తో ఇబ్బందులకు గురిం చేశారు. అంతేకాకుండా కిడ్నాపర్లు గేదెల పేడను నోటిలో వేసి.. ముక్కుపై షూ రుద్దడంతోపాటు ఉమ్మి కూడా వేశారు. అయితే ఈ అరాచకాన్ని మొత్తం ఫోన్లలో వీడియో కూడా తీశారు కిడ్నాపర్లు.
ఉత్తరప్రదేశ్ లో ఓ సంఘటన వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో నాలుగేళ్ల బాలికపై ఓ క్రూరుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. వరుసకు చిన్నారి మేనకోడలు అవుతుంది. అయితే ఆ చిన్నారికి చాక్లెట్ తినిపిస్తానని చెప్పి తీసుకొని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కిడ్నాపర్లు అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బాలుడి పేరెంట్స్ కు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు రెండో రోజు మొదటి సెషన్ సీఐడీ అధికారుల విచారణ ముగిసింది. ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే, సీఐడీ అధికారులకు మరొక మూడున్నర గంటలు మాత్రమే మిగిలి ఉంది.
హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ప్రొఫెషనల్స్ కార్ల ర్యాలీ తీశారు. నేడు (ఆదివారం) తెల్లవారుజాము నుంచే ఈ ర్యాలీ స్టార్ట్ అయింది. కారులతో సంఘీభావ యాత్ర అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో స్థానికులు ఆందోళన చేస్తున్నారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ పోలీసుల ఎదుట హాజరై విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు గత ఐదు గంటలుగా విచారిస్తున్నారు. దేవరకొండ సురేష్, రామచంద్రలతో పరిచయాలపై నార్కోటిక్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన ముష్కరులలో దీపాంశు అలియాస్ మోను, మొయినుద్దీన్ అలియాస్ సల్మాన్ ఉన్నారు. వీరిద్దరూ సల్మాన్ త్యాగి గ్యాంగ్‌కు చెందినవారు కాగా.. సల్మాన్ త్యాగికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉంది.