హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ప్రేమోన్మాది దాడి ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్ కావడంతో ముగ్గురూ చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఆ క్లోజ్‌నెస్‌కు లవ్ అని పేరు పెట్టేసిన శివకుమార్.. సంఘవికి తన మనసులోని మాట చెప్పాడు. చిన్ననాటి స్నేహితులం కదా అని చనువిస్తే.. ఇదేం పద్దతి అంటూ పృథ్వి, సంఘవి శివకుమార్‌కు వార్నింగ్ ఇచ్చారు.
ఎండీఎంఏ డ్రగ్ అత్యంత ప్రమాదకరమైంది అని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ అన్నారు. ఎండీఎంఏ మత్తు మందును తీసుకుంటే 24 గంటలు పాటు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.. అంతేకాదు ఇటీవల కాలంలో మెట్రో నగరాలు ఈ డ్రగ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది అని ఆయన వ్యాఖ్యనించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లా చసానా సమీపంలో సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతంకాగా.. ఓ జవాన్ గాయపడ్డాడు.
శ్రీ సత్యసాయి హిందూపురం జిల్లాలోని లేపాక్షి మండలం ఇందిరమ్మ కాలనీలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ జంట తిలక్ నగర్ లో ఉన్న విషయాన్ని గుర్తించిన మహిళ తన పేరేంట్స్ కు విషయం చెప్పడంతో ఈ జంటను పట్టుకుని చితకబాదారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి అక్కా తమ్ముడిపై శివకుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంఘవి, పృథ్వీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసేందుకు వెళ్తున్న కామారెడ్డి బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఏడు గంటల పాటు పోలీస్ వ్యానుల్లో తిప్పి బిచుకుంద పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో మరో సారి భారీగా డ్రగ్స్ ని అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అడ్డగా కొనసాగుతున్న డ్రగ్స్ దందాకి అధికారులు ఫుల్ స్టాప్ పెట్టారు. లావోస్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన నలుగురు మహిళల నుంచి 5 కిలోలకు పైగా కోకాన్ ను స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లి చందనే అక్క దీప్తిని హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. ఈ కేసును పోలీసులు తొందరగా చేధించారు