మ్యాట్రిమోని పేరుతో నైజీరియన్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. 1020 కేసుల్లో నిందితుడిగా ఓ నైజిరియన్ అలెక్స్ ఉన్నాడు. ఇప్పటి వరకు 12 కేసులను సైబర్ పోలీసులు ఛేదించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన నార్త్ జోన్ పోలీసులు.. చదువు కోసం ఇండియాకు వచ్చి నైజీరియన్ అలెక్స్ అక్రమాలకు పాల్పడ్డాడు. పెళ్లి కానీ అమ్మాయిలే టార్గెట్ గా అలెక్స్ మోసాలకు దిగాడు. ఓ యువతి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి తెలిపారు.
Read Also: Cheetahs Died: కునో నేషనల్ పార్క్‌లో చిరుతలు ఎందుకు చనిపోయాయో తెలుసా..!
మ్యాట్రిమోనిలో బాధితురాలు ప్యాకేజ్ తీసుకుంది.. ఒక సర్జన్ ప్రొఫైల్ ను యువతికి పంపించారు.. 2023 మార్చ్ లో అమ్మాయి సర్జన్ వాళ్ళ కుటుంబంతో సర్జన్ తో టచ్ లో ఉన్నాడు అని నార్త్ జోన్ డీసీపీ తెలిపింది. ఎప్పుడు నేను బిజీగా ఉన్నాను అంటూ.. తప్పించుకునే వాడు.. సిరియాలో నాతో పాటు వచ్చిన డాక్టర్లు చనిపోయారు.. నీకోసం ఇండియాకు రావాలి అనుకుంటున్నాను అని నమ్మించి.. 10 వేల రూపాయలు తన అకౌంట్ లోకి వేయించాడు.. ఇండియాకు వచ్చాక ..కస్టమ్స్ వాళ్ళతో మాట్లాడించినట్టు చేశారు.. చివరకు అమ్మాయి ఒకే రోజు 14 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది అని డీసీపీ చందనా దీప్తి తెలిపారు.
Read Also: CM KCR: కొల్లాపూర్ లో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం
అమ్మాయిని నమ్మించడం కోసం ..తన ఇంటికి నైజీరియన్ ద్వారా ఒక బాక్స్ పంపించాడు.. కొద్ది రోజుల తరువాత..బాక్స్ లోంచి చెడు వాసన వచ్చింది.. అప్పుడు పోలీస్ లకు సదరు మహిళ ఫిర్యాదు చేసింది.. ఆ బాక్స్ లో పేలుడు పదార్థాలు వుండొచ్చు అని అనుమానించాము.. ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగే బ్లాకెండ్ ఫ్రాడ్ గా గుర్తించాము.. ఇంటర్నేషనల్ వెబ్ సైట్ లలో.. ఈ మోసం గురించి అక్కడి దర్యాప్తు సంస్థలు పెట్టాయి.. ఇలాంటి మోసాలు ఇప్పటికీ చాలా మందిని చేశారు.. ఒక్క సంవత్సరంలో నిందితుడు 68 సిమ్ కార్డులు వాడాడు అంటూ డీసీపీ చెప్పింది. ఇప్పటి దాకా 12 కేసులు చేదించాము.. 1025 కేసుల్లో నిందితుడు వాడిన సెల్ నంబర్ ను సైబర్ క్రైమ్ పోర్టల్ లో గుర్తించారు.. ఇంటరాగేషన్ లో నిందితుడు అసలు నిజాలు చెప్పట్లేదు.. కస్టడీలో నిందితుడిని విచారిస్థాము అని చందనా దీప్తి పేర్కొన్నారు.