Delhi : ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలోని తన సొంత ఇంట్లో మంచం కింద పడి ఉన్న ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను రెండో భర్త హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై అగంతకులు చేసిన వేధింపులకు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
మ్యాట్రిమోని పేరుతో నైజీరియన్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. 1020 కేసుల్లో నిందితుడిగా ఓ నైజిరియన్ అలెక్స్ ఉన్నాడు. ఇప్పటి వరకు 12 కేసులను సైబర్ పోలీసులు ఛేదించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన నార్త్ జోన్ పోలీసులు.. చదువు కోసం ఇండియాకు వచ్చి నైజీరియన్ అలెక్స్ అక్రమాలకు పాల్పడ్డాడు.
బీహార్లోని బంకాలో జంట హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మోతిహారిలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. బంకాలోని పొదల మధ్య ఉన్న బావిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
కర్ణాటకలో గేదెల దొంగతనానికి పాల్పడిన 78 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 58 ఏళ్ల క్రితం రెండు గేదెలు, ఒక దూడను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1965లో గణపతి విఠల్ వాగూర్ అతని సహచరులలో మరొకరు దొంగతనం ఆరోపణలపై మొదటిసారిగా అరెస్టయ్యారు. అప్పటికి గణపతి విఠల్ వయసు 20 ఏళ్లు. ఆ సమయంలో ఇద్దరికీ బెయిల్ వచ్చినప్పటికీ.. వాగూర్ పరారీ అయ్యాడు.
బావిలో ఓ కుటుంబం మొత్తం శవమై తేలింది. పెళ్ళీడుకు వచ్చిన కూతురితో సహా దంపతులు మృతి చెంది కనిపించారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని మర్రిపాలెంలో ఎండీ మహముద్దీన్ కుటుంబంతో కలిసి జీవించేవారు. ఏం జరిగిందో తెలీదుగానీ కుటుంబంతో సహా వ్యవసాయ బావిలో పడి మృతిచెందారు.
ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. అమేథీలో వీఐపీ తరహాలో దొంగలు చోరీకి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో వచ్చి మేకల దొంగతనానికి పాల్పడ్డాడు.
మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పై గౌహతి పోలీస్ కమిషనర్ దిగంత బోరాహ్ మాట్లాడుతూ.. నిందితులు హెరాయిన్ ను సుబ్బుపెట్టెల్లో ఉంచి రహస్యంగా తరలించేందుకు ప్రయత్నించారని.. కాగా తమకు అందిన రహస్య సమాచారం ఆధారంగా నిందితులని పట్టుకున్నామని వెల్లడించారు.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. పంజాగుట సర్కిల్ లోని మెరిడియన్ హోటల్ కు బిర్యానీ తినేందుకు వచ్చిన కస్టమర్ లియాకత్ తో హోటల్ సిబ్బంది గోడవపడ్డారు. ఎక్స్ ట్రా పెరుగు తీసుకోవాని రావాలని అడగడంతో గొడవ ప్రారంభమైంది. హోటల్ లో లియాకత్ పై సిబ్బంది దాడికి పాల్పడ్డారు.