తిరుమలలో కిడ్నాప్ కు గురైన మూడేళ్ల చిన్నారి ఘటన సుఖాంతమైంది. ఈరోజు మధ్యాహ్నం ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో వెల్లడైంది. తెలంగాణలోని గద్వాల్ జిల్లాకు చెందిన అభినయ్ అనే మూడేళ్ల చిన్నారిని ఓ మహిళ అపహరించింది. యాత్రికుల వసతి సముదాయం 2 వద్ద చిన్నారిని ఎత్తుకెళ్లింది. దీంతో హుటాహుటిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం గాలించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద సీసీటీవీలో చిన్నారిని ఎత్తుకెళ్తున్నట్లు మహిళ కనిపించింది.
CM Jagan: రేపు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజి ద్వారా దర్యాప్తు ప్రారంభించారు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు చిన్నారిని ఎత్తుకెళ్లిన మహిళను పట్టుకున్నారు. దీంతో బాలుడి కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. తిరుపతిలోని పెద్దకాపు లే ఔట్లో బాలుడిని గుర్తించారు పోలీసులు. అయితే.. చిన్నారిని ఎందుకు ఎత్తుకెళ్లావని పోలీసులు విచారించగా.. పిల్లలు లేకపోవడంతో బాలుడిని పెంచుకునేందుకు కిడ్నాప్ కి పాల్పడినట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
Dharmana Prasada Rao: రాజకీయ జీవితానికి విశ్రాంతి అవసరమనిపిస్తోంది.. మంత్రి కీలక వ్యాఖ్యలు