sexually assaulted: తిరుపతిలోని రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ఆశ్రమ నిర్వాహకుడితో పాటు మరో యువకుడిపై పోలీసులు ఫోక్సో కేసును నమోదు చేశారు. అయితే, వివరాల్లోకి వెళ్తే.. కూతురుకు దెయ్యం పట్టిందని రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం స్వామిజీని పేరెంట్స్ ఆశ్రయించారు. అయితే, అర్ధరాత్రి ఒంటరిగా పూజలు చేయాలని చెప్పి.. మైనర్ బాలికపై కోదండ రామాచార్యులు అలియాస్ మూర్తి స్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక గాడికి పాల్పడ్డ స్వామీజీ వ్యవహారాన్ని పేరెంట్స్ కాకుండా.. తాను ప్రేమించిన మహమ్మద్ షఫీ అనే యువకుడికి సదరు మైనర్ బాలిక చెప్పింది.
Read Also: OTT Movies: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
ఇక, ఇద్దరు స్నేహితుల సాయంతో ఆశ్రమం నుంచి మైనర్ బాలికను మహ్మద్ షఫీ తీసుకెళ్లాడు. ఇక, విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కూతురు కనిపించలేదని గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ బాలికను రేణిగుంటకు తీసుకొచ్చారు.. అలాగే, మహమ్మద్ షఫీతో పాటు మరో ఇద్దరి యువకులను అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ షఫీ, ఆశ్రమ నిర్వాహకుడు మూర్తి స్వామీజీలపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయగా.. రాజరాజేశ్వరి దేవి ఆలయం స్వామిజీ మూర్తి పరారీలో ఉన్నారు అని పోలీసులు వెల్లడించారు.