సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆలోచించే విధంగా.. మరికొన్ని సీసీటీవీ వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఓ వ్యక్తి గుడిలోకి మహాభక్తుడిలా బిల్డప్ ఇస్తూ ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఏమీ ఎరగనట్టు గర్భగుడిలో అడుగుపెట్టాడు.
Also Read: Viral: అసలు అలా ఎలా యాక్సిడెంట్ అయ్యిందిరా అయ్యా..?!
ఆపై గర్భగుడిలో ఉన్న శివలింగానికి భక్తి శ్రద్ధలతో కూడా నమస్కరించాడు. కాకపోతే అక్కడ ఎవరూ ఊహించని విధంగా తన పని కానిచ్చేసి అక్కడి నుంచి జారుకున్నాడు ఓ దొంగ. అక్కడి సీసీటీవీ కెమెరాలో అతడి నిర్వాకం మొత్తం రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియా బాట పట్టింది. దీనితో ఇనేం ఉంది ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయ్యింది. ఈ దొంగతనం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది.
Also Read: Viral: ప్రెజర్ కుక్కర్ ను ఇలా కూడా వాడేస్తున్నారా..?!
వీడియోలో ఉన్న దాని ప్రకారం.. ఓ వ్యక్తి పక్కా ప్లాన్ తో మీరట్ లోని ఓ శివాలయంలో దొంగతనానికి పాల్పడ్డాడు. మొదట అతడు ఏమీ తెలీనట్టు.. గుడిలోకి ప్రవేశించి ఆపై గర్భగుడిలోకి వెళ్లి అక్కడున్న శివలింగంతో పాటు ఇతర దేవతా విగ్రహాలకు ముందుగా నమస్కరించారు. అతనితో వెంట తెచ్చుకున్న ఓ సంచీని అక్కడే వదిలి ఓ నిమిషం పాటు బయటకు వచ్చాడు. చుట్టుపక్కల గుళ్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని శివలింగానికి ఉన్న నాగాభరణాన్ని తీసి తన సంచీలో వేసుకున్నాడు అంతే. ఇంకేముంది తనకి ఏమీ ఎరగనట్టు అక్కడి నుంచి సైలెంట్ గా జారుకున్నాడు. ఆ మరుసటి రోజు దైవదర్శనం కోసం వచ్చిన కొందరు భక్తులు శివుని నాగాభరణం చోరీకి గురైందని గుర్తించి.. విషయాన్నీ కాస్త పోలీసుల దృష్టికి కూడా వెళ్లడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు.
In an incident that seems to be an example of antithetical acts that exposes a very bizarre and scary aspect worshipping god, a video capturing a man stealing an idol from a temple in #UttarPradesh's #Meerut is doing rounds on social media.
Interestingly, the man was seen… pic.twitter.com/jXeC5AxpS2
— Hate Detector 🔍 (@HateDetectors) March 13, 2024