దక్షిణ అమెరికా దేశలలో ఒక్కటైనా బ్రెజిల్ దాదాపు 60 శాతం మేర అమెజాన్ అడవులను కలిగి ఉంది. ప్రస్తుతం అక్కడ కరవు కారణంగా చెలరేగిన అడవులలో జరిగిన దావాగ్ని పెద్ద బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చుల కారణంగా అనేక వేలాది ఎకరాల్లో అమెజాన్ అడవి ప్రాంతం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇంకా చాలా తరచూగా అగ్నిప్రమాదాలు జరుగడం వల్ల అక్కడ ఉన్న జంతుజాలం, చెట్ల సంపద పై తీవ్ర ప్రభావం కనపడుతోంది. కార్చిచ్చుల బీభత్సం రొరైమా రాష్ట్రంలో అధికంగా కనపడుతోంది. బ్రెజిల్ దేశ పరిమాణంలో రొరైమా కేవలం 2.6 శాతమే అయిన గడిచిన నెలలో ఏకంగా రెండు వేలకు పైగా కార్చిచ్చులు సంభవించాయి అంటే అక్కడి పరిస్థితి అర్థం అవుతుంది. బ్రెజిల్ దేశ వ్యాప్తంగా నమోదైన కారిచ్చుల్లో కేవలం రొరైమా ప్రాతంలోనే ఏకంగా 30 శాతం వరకు నమోదయ్యాయి.
Also Read: WPL 2024: వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..!
ఈ ప్రాంతంలో అటవీ మంటలు కాస్త జనావాసాలకు కూడా చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ పరిస్థితులలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చే సమయం ఉండదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. దాంతో అక్కడి వారు వారి ఇంటిని, అలాగే పొలాలను వదిలేసి ప్రాణాల కోసం పరుగులు తీయడం తప్ప ఏమీ చేయలేమని వారి ఆవేదనను తెలుపుతున్నారు. ముఖ్యంగా రొరైమా రాష్ట్రంలో ఇలా తరచూ కార్చిచ్చులు సంభవిస్తుండడంతో అధికారులు మంటలార్పేందుకు కొన్ని వందల మందితో అనేక బృందాలన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మాత్రం కాస్త సరిపడా హెలికాప్టర్లు తక్కువ ఉండడంతో మంటల్ని అదుపుచేయడం కష్టతరంగా మారిందని అధికారులు అంటున్నారు. ఈ విషయం పై బ్రెజిల్ ప్రభుత్వానికి సాయం కోరినట్టు అధికారులు తెలిపారు.
Also Read: IRCTC: ఇకపై గంటలోపే మీ అకౌంట్లోకి రిఫండ్స్ డబ్బులు..!
రొరైమా రాష్ట్రంలో కార్చిచ్చుల సంఖ్య ఎక్కువగా ఉండటం గల మరో కారణం అక్కడ కొందరు వ్యక్తులు తమ భూములను విస్తరించే భాగంలో అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లను కాల్చుతుండటం వల్ల మంటలు చెలరేగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అలంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు.