కాస్త ఖరీదైన సెల్ఫోన్ కోసం సొంత నానమ్మని చంపి ఆపై.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగతనం చేసి ఆపై శవాన్ని వారి ఇంట్లోనే పాతిపెట్టాడు ఓ కిరాతక మనవడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన గోనెగండ్ల మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. మండలం పరిధిలోని పెద్ద మరివీడు గ్రామానికి చెందిన కురువ నాగమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడైన చిన్న బజారి కర్నూలులో స్థిరపడిపోవడంతో..…
హైదరాబాద్ మల్కాజ్గిరిలో పోలీస్ హై అలర్ట్ నిర్వహించారు. ప్రధాని మోడీ ఈరోజు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ విజయ సంకల్ప రోడ్ షో చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రత నిర్వహించనున్నారు. మల్కాజ్గిరిలో మోడీ రోడ్ షో 1.3 కిలోమీటర్, గంట పాటు సాగనుంది. అందుకోసమని.. రెండు వేలకు పైగా10 అంచెల పోలీస్ భారీ భద్రత చేపట్టనున్నారు.
సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆలోచించే విధంగా.. మరికొన్ని సీసీటీవీ వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఓ వ్యక్తి గుడిలోకి మహాభక్తుడిలా బిల్డప్ ఇస్తూ ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఏమీ…
ప్రజలు ఎవరైనా వారి మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటే కనుక వెంటనే వారు చాట్ – బాట్ వాట్సప్ నెంబర్ ‘“9440627057” కు హాయ్ అని మెసేజ్ పంపాలి. దాంతో ఆ వెంటనే మీకు ఆ నెంబర్ నుండి ఓ గూగుల్ పేజీ లింక్ వస్తుంది. ఆపై లింక్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో పోయిన మొబైల్ వివరాలను పొందుపరిస్తే చాలు. దాంతో మనం ఇచ్చిన సంచారంతో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘాను ఏర్పాటు చేసి…
దక్షిణ అమెరికా దేశలలో ఒక్కటైనా బ్రెజిల్ దాదాపు 60 శాతం మేర అమెజాన్ అడవులను కలిగి ఉంది. ప్రస్తుతం అక్కడ కరవు కారణంగా చెలరేగిన అడవులలో జరిగిన దావాగ్ని పెద్ద బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చుల కారణంగా అనేక వేలాది ఎకరాల్లో అమెజాన్ అడవి ప్రాంతం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇంకా చాలా తరచూగా అగ్నిప్రమాదాలు జరుగడం వల్ల అక్కడ ఉన్న జంతుజాలం, చెట్ల సంపద పై తీవ్ర ప్రభావం కనపడుతోంది. కార్చిచ్చుల బీభత్సం రొరైమా రాష్ట్రంలో అధికంగా…
కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం జంపాపురంలో దారుణం చోటు చేసుకుంది. తన మూడేళ్ళ చిన్నారిని ఓ కసాయి తండ్రి శాంతి కుమార్ గొంతు కోసి చంపేశాడు. ఇవాళ తెల్లవారు జామున తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతు కోసి ఆ పాసికూనను హతమార్చాడు.
గుంటూరు జిల్లాలో తెనాలి నాజర్ పేటలో కిరణా షాపు వ్యాపారి కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి శంకర్ రావు అనే వ్యాపారి కుటుంబం ప్రయత్నించింది. ఇక, భార్య, కుమార్తె కుటుంబం విష గుళికలు మింగారు.
విశాఖపట్నం నగరంలోని నడిబొడ్డున చిరుత పులి చర్మాన్ని రవాణా చేస్తున్న కొందరు కేటుగాళ్లను పోలీస్ అధికారులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు చిరుతపులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్ఐ( DRI ) వర్గాలకు అందిన సమాచారం మేరకు మంగళవారం నాడు సాయంత్రం పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు.
తిరుపతిలోని రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ఆశ్రమ నిర్వాహకుడితో పాటు మరో యువకుడిపై పోలీసులు ఫోక్సో కేసును నమోదు చేశారు.